Share News

హోరెత్తించిన ఎడ్లబండ్ల పోటీలు

ABN , Publish Date - Dec 31 , 2023 | 09:50 PM

గుడిపేట శివారులో ఏర్పాటు చేసిన ఎడ్లబం డ్ల పోటీలు హోరెత్తించాయి. తిప్పని మహేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించారు. 20 బండ్లు పాల్గొనగా ఎస్సై నరేష్‌ జెండా ఊపి పోటీలు ప్రారంభించారు.

హోరెత్తించిన ఎడ్లబండ్ల పోటీలు

హాజీపూర్‌, డిసెంబరు 31: గుడిపేట శివారులో ఏర్పాటు చేసిన ఎడ్లబం డ్ల పోటీలు హోరెత్తించాయి. తిప్పని మహేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించారు. 20 బండ్లు పాల్గొనగా ఎస్సై నరేష్‌ జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ప్రథమ బహుమతి అచ్చలాపూర్‌ చెందిన కోటిపల్లి సాగర్‌ గెలుపొందగా పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఒడ్డే శ్రీనివాస్‌లు 3 గ్రాముల బంగారం అందించారు. ద్వితీయ బహుమతి పాత మంచిర్యాలకు చెందిన తూముల వెంకటరామయ్య గెలుపొందగా 6 గ్రా ముల వెండి కందుల రమేష్‌ అందించారు. తృతీయ బహుమతి పెంచాల లక్ష్మణ్‌ గెలువగా ఎంపీటీసీ ఒడ్డే బాలరాజు 4 గ్రాముల వెండి బహుమతి అందించారు. అత్తె శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. రాజమౌళి, శ్రీనివాస్‌, కృష్ణమూర్తి, సురేందర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 09:50 PM