సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు

ABN , First Publish Date - 2023-06-26T22:52:51+05:30 IST

ఆసిఫాబాద్‌, జూన్‌ 26: జిల్లాలో ఈనెల 30న సీఎం కేసీఆర్‌ పర్యటనను విజయవంతం చేసేదిశగా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయా లని కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ రాజేశం, ఎస్పీ సురేష్‌కుమార్‌తో కలిసి జిల్లా అధికారులతో సీఎం పర్యటనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు

ఆసిఫాబాద్‌, జూన్‌ 26: జిల్లాలో ఈనెల 30న సీఎం కేసీఆర్‌ పర్యటనను విజయవంతం చేసేదిశగా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయా లని కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ రాజేశం, ఎస్పీ సురేష్‌కుమార్‌తో కలిసి జిల్లా అధికారులతో సీఎం పర్యటనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 30న సీఎం పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభోత్సవం, కుమరం భీం, కోట్నాక భీంరావు విగ్రహాల ఆవిష్కరణ, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమాలతో పాటు పలుఅభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు ఉన్నందున శాఖల అధికా రులు సమన్వయంతో పర్యటన విజయవంతం చేసే దిశగా కృషి చేయాలని తెలిపారు. జిల్లా అధికారులు మధ్యాహ్న భోజనవసతి, ప్రముఖులకు అల్పా హారం, అవసరమైన ఏర్పాట్లు ఆయా అధికా రులకు కేటాయించి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. బహిరంగ సభ ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. పోడుపట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభి స్తారని, జిల్లాలోని సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గాల వారీగా ఆరుగురు చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు అందిస్తామని తెలిపారు. సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని అందంగా అలంకరించాలని తెలిపారు. సమా వేశంలో ఆర్డీవో రాజేశ్వర్‌, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:52:51+05:30 IST