సీఎంఆర్ గడువు ముగిసింది
ABN , First Publish Date - 2023-05-04T01:06:25+05:30 IST
కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారం పౌరసరఫరాలశాఖకు కత్తిమీద సాములా మారుతోంది.
గడువు పెంపు కోసం మిల్లర్ల ప్రయత్నాలు
ఇంకా 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి
మొన్నటి ఖరీఫ్ సీఎంఆర్ మిల్లింగ్ మరింత ఆలస్యం
పౌర సరఫరాల శాఖకు కత్తి మీద సాము
నిర్మల్, మే 3 (ఆంధ్రజ్యోతి) : కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారం పౌరసరఫరాలశాఖకు కత్తిమీద సాములా మారుతోంది. రైస్ మిల్లర్లు ఏప్రిల్ 30 గడువులోగా సీఎంఆర్ రైస్‌ను ఆ శాఖకు తిరిగి ఇవ్వాల్సింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మిల్లర్లు పథకం ప్రకారమే గడువులోగా సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా సీఎంఆర్‌ను సంబంధింతశాఖకు అప్పజెప్పడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిర్దేశించిన గడువులోగా మిల్లర్లంతా సీఎంఆర్ బియ్యాన్ని తిరిగి ఇవ్వాలంటూ అధికారులు పలుసార్లు ఇచ్చిన వార్నిం గ్‌లు అన్ని బేఖా తరవుతున్నాయని అంటున్నారు. ఖరీఫ్, రబీసీజన్లకు సంబంధించిన ధాన్యాన్ని అధికారులు సీఎంఆర్ కోసం రైస్‌మిల్లులకు తరలిస్తుంటారు. మిల్లుల కెపాసిటీని ప్రాతిపదికగా చేసుకొని కోటా ప్రకారం జిల్లాతో పాటు సమీపంలో ఉన్న పెద్దపల్లి మరికొన్ని జిల్లాలకు సీఎంఆర్ కోసం ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. సీఎంఆర్ కోసం వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు సకాలంలో మిల్లింగ్ చేయకుండా జాప్యం చేస్తుం డడంపై ఇప్పటికే చాలా సార్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మిల్లింగ్ కోసం గడువులు కూడా విఽధింంచారు. ఈ గడువులు దాటి పోతుంండడం, ప్రభుత్వం గడువులను పెంచుతుండడం రివాజుగా మా రింది. 2021 - 22 రబీ సీజన్‌కు సంబంధించి ఇంకా 25 వేల 668.699 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాలశాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. నెలరోజుల క్రితం సీఎంఆర్ గడువును పెంచినప్పటికీ మిల్లర్లు ఆశించిన రీతిలో సీఎంఆర్‌ను తిరిగి ఇవ్వలేదు. 98 వేల 776.640 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం రైస్‌మిల్లులకు అందించారు. దీని ప్రకారం రైసుమిల్లులు 66 వేల 596.180 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంంఆర్ కింద తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే మూడు సీజన్లు దాటినప్పటికీ ఇప్పటివరకు రైసుమిల్లర్లు కేవలం 40 వేల 927.481 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే పౌర సరఫరాలశాఖకు తిరిగి ఇచ్చారు. మరో25 వేల 668.699 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ఇవ్వాల్సి ఉంది. గడువును మూడు, నాలుగు సార్లు పెంచినప్పటికీ ఆ గడువులోగా మిల్లర్లు సీఎంఆర్ బియ్యంను పూర్తి స్థాయిలో తిరిగి ఇవ్వలేదు. దాదాపు ముప్పావు భాగం బియ్యాన్ని ఎప్పటిలోగా చెల్లిస్తారోననే విషయం అంతుపట్టడం లేదంటున్నారు. ఈ బియ్యాన్ని తిరిగి మిల్లింగ్ చేసి ఇచ్చేందుకు గడువును పెంచాలన్న డిమాండ్‌ను ఇటు మిల్లర్లు అటు సంబంధిత అధికారులు తెరపైకి తె స్తున్నట్లు ప్రచారం మొదలైంది. సకాలంలో మిలింగ్ చేయకుండా సీఎం ఆర్ బియ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు పథకం ప్రకారం జాప్యం చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి.
ఖరీఫ్ సీఎంఆర్‌పై మరింత అయోమయం
2022-23 ఖరీఫ్‌సీజన్‌కు సంబంధించి ధాన్యం మిల్లింగ్ విషయంలో రైసుమిల్లుల యజమానులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఖరీఫ్‌సీజన్‌కు సంంబంధించి 1 లక్ష 68 వేల 177 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ మిల్లింగ్ కోసం బియ్యం మిల్లులకు పౌర సరఫరాలశాఖ కేటాయించింది. దీనికి సంంబంధించి బియ్యం మిల్లులు ధాన్యాన్ని మరపట్టి 1 లక్ష 12 వేల 678 మెట్రిక్ టన్నుల బి య్యాన్ని సీఎంఆర్ కోసం తిరిగి ఇవ్వాల్సి ఉంది. దాదాపు మూడు నెలల నుంచి మిల్లింగ్‌లో జాప్యం చేసిన మిల్లర్లు ఇప్పటి వరకు కేవలం 981 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే తిరిగి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మిల్లర్లు ఇంకా 1 లక్ష 11 వేల 697 మెట్రిక్ టన్ను ల బియ్యాన్ని పౌరసరఫరాలశాఖకు సీఎంఆర్ కింద తిరిగి ఇవ్వాల్సి ఉంది. గత రబీసీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ బియ్యంను పూర్తి స్థాయిలో ఇవ్వని రైస్‌మిల్లులు ఖరీఫ్ సీఎంఆర్ బియ్యాన్ని ఎప్పటిలోగా తిరిగి ఇస్తాయోనన్న సందేహాలు నెలకొంటున్నాయి.
మొదలైన యాసంగి కొనుగోళ్లు
జిల్లాలో మొత్తం 204 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రస్తుత యాసంగి సీజన్‌కు గాను 1 లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 26 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం ఏడు కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. వర్షాల కారణంగా ధాన్యంం కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదంటున్నారు. గత రబీ, ఖరీఫ్ సీజన్‌లకు సంబంధింంచిన సీఎంఆర్ ధాన్యంం మిల్లింగ్ ఇప్పటికే పెద్ద మొత్తంలో పెండింగ్ ఉన్న నేపథ్యంలో మళ్లీ ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం మిల్లింగ్ వ్యవహారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.