Share News

సింగరేణి సంస్థను దోపిడీ చేసిన సీఎండీ శ్రీధర్‌

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:26 PM

సింగరేణి సంస్థను అన్ని రకాలుగా దోపిడీ చేసిన సీఎండీ శ్రీధర్‌ను వదలిపెట్టే ప్రసక్తే లేదని సీపీఐ శాసనసభ్యుడు, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశిరావు అన్నారు. ఆదివా రం సాయంత్రం నస్పూర్‌లో నిర్వహించిన ఏఐటీయూసీ జనరల్‌ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సింగరేణి సంస్థను దోపిడీ చేసిన  సీఎండీ శ్రీధర్‌

శ్రీరాంపూర్‌, డిసెంబర్‌ 17 : సింగరేణి సంస్థను అన్ని రకాలుగా దోపిడీ చేసిన సీఎండీ శ్రీధర్‌ను వదలిపెట్టే ప్రసక్తే లేదని సీపీఐ శాసనసభ్యుడు, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశిరావు అన్నారు. ఆదివా రం సాయంత్రం నస్పూర్‌లో నిర్వహించిన ఏఐటీయూసీ జనరల్‌ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్‌ నిర్వాకం వల్ల సింగరేణి నిధులు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని, ఎవరి సొమ్మని అందరికీ పంచారని ఆయన ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ధారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎండీ శ్రీధర్‌ను జైలుకు పంపేవరకు విశ్రమించేది లేదని పేర్కొన్నారు. టీబీజీకేఎస్‌ యూనియన్‌ నాయకులు కార్మికుల శ్రమను, డబ్బును దోపిడీ చేశారని, వారి రక్తం తాగారని దుయ్యబట్టారు. కార్మికుల పక్షాన తన గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తానని చెప్పారు. సిం గరేణి ఉన్నంత వరకు ఏఐటీయూసీ ఉంటుందని, తమ యూనియన్‌కు ఓటు వేసి గెలిపిస్తే సంస్థతో పాటు కార్మికుల హక్కులు కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వి.సీతారామయ్య, కేంద్ర కార్యదర్శి బోస్‌, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య మాట్లా డుతూ, 27న జరిగే ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించడం ఖాయ మని ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ఎన్నికలు ఆపేందుకు ఏఐటీ యూసీ, ప్రభుత్వంతో కలిసి కోర్టుకు వెళ్లి కుట్రలు పన్నుతున్నారని, వాటి ని తిప్పికొడతామని పేర్కొన్నారు. 80 ఏళ్ల చరిత్ర కలిగిన యూనియన్‌ నాయకులు కార్మికుల కోసం తమ ప్రాణత్యాగాలు చేశారని, లాభాల వాటా, దసరా అడ్వాన్స్‌, దీపావళి బోనస్‌ తదితర హక్కులు సాధిం చామన్నారు. టీబీజీకేఎస్‌ మరుగున పడేసిన కార్మికుల హక్కులు సాధిం చేందుకు పోరాడుతామన్నారు. హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూలకు అంత బలం లేదని, ఐన్‌టీయూసీతో కార్మికులకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. టీబీజీ కేఎస్‌ అయిపోయిన ముచ్చట అని ఎద్దేవా చేశారు. అనంతరం 48 డిమాండ్లతో కూడిన హామీ పత్రాన్ని విడుదల చేశారు. పలువురు టీబీ జీకేఎస్‌ యూనియన్‌ నాయకులు ఏఐటీయూసీలో చేరారు. ఈ సమా వేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, బెల్లంపల్లి నియోజ కవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌, ఉప ప్రధాన కార్యదర్శులు కె. వీరభద్రయ్య, ముష్కె సమ్మయ్య, నాయకులు మోత్కూరి కొమురయ్య, చంద్రమోహన్‌, నర్సింగరావు, ప్రసాద్‌ రెడ్డి, రవీందర్‌, మారేపల్లి బాబు, సీపీఐ మం డలాధ్యక్షుడు జోగుల మల్లయ్య, నాయకుడు మిర్యాల రాజేశ్వర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 10:26 PM