ఓటరు జాబితాలో ఉన్న పేర్లను పరిశీలించండి : కలెక్టర్
ABN , First Publish Date - 2023-05-13T01:31:03+05:30 IST
రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు పరిశీలించాలని కలెక్టర్ కే.వరుణ్‌రెడ్డి సూచించారు.
నిర్మల్ కల్చరల్, మే 12 : రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు పరిశీలించాలని కలెక్టర్ కే.వరుణ్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఓటర్ల జాబితాలో తప్పొప్పుల సవరణ కోసం రాజకీయ పార్టీల నాయకులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లు నిండి ఓటర్ల జాబితాలో పేర్లు లేనట్లయితే వారి నుండి బూత్‌లెవల్ ఏజెంట్లు దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. ఓటరుపేరు రెండు జాబి తాల్లో ఉంటే ఒకదానిలో తొలగించేందుకు దరఖాస్తు స్వీకరించాల న్నారు. అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల నాయకులు డివిజన్ స్థాయిలో ఆర్డీవో కు ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యమైన వారిపేర్లు జాబితాలో లేకుంటే వారితో ఏజెంట్లు పరిశీలించి దరఖాస్తు చేయించాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఓటర్ల జాబితాలో పేర్లను పరిశీలించుకోచ్చునని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో స్రవంతి, పలు పార్టీల నాయకులు రమేష్, మజహర్, జగన్మోహన్, శ్రావణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం
నిర్మల్ టౌన్, మే 12 : జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణపై కలెక్టర్ వరుణ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశహాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రెవెన్యూ, పారిశుధ్య, పట్టణ ప్రణాళిక విభాగ అధిపతులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ విభాగంకు సంబంధించిన రెవెన్యూ పెంపొందిం చుకునేందుకు దానితో పాటు ఆదాయ వనరులు పెంపొందించుకొనుటకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పురపాలక శాఖ ద్వారా జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ పనుల నిర్వహణకు జరుగుతున్న సమయం తగ్గించుకొనుటకు పనుల వేగంం పెంచుకొనుటకు ఆదేశించంఆరు. శానిటేషన్ విభాగంకు సంబంధించి రాబోయే వర్షాకాలాన్ని దృష్టాలో ఉంచుకొని పట్టణంలోని నీటి ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలుగా శానిటేషన్ పరంగా ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ముంపునకు గురయ్యే కాలనీలకు ముందస్తు చర్యగా నీళ్లు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నిర్మల్ కమిషనర్ సీవీఎన్ రాజు, భైంసా కమిషనర్ వెంకటేష్, ఖానాపూర్ కమిషనర్ రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.