ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనను నిరసిస్తూ హోరెత్తిన బీజేవైఎం ఆందోళన

ABN , First Publish Date - 2023-03-19T00:32:31+05:30 IST

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను నిరసిస్తూ రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన భైంసాలో శనివారం బీజేవైఎం చేపట్టిన ఆందోళన లు హోరెత్తాయి.

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనను నిరసిస్తూ హోరెత్తిన బీజేవైఎం ఆందోళన
భైంసాలో సీఎం కేసీఆర్‌ దిష్టిబోమ్మను దహనం చేస్తున్న బీజేవైఎం శ్రేణులు

ముఖ్యమంత్రి కేసీఅర్‌ దిష్టిబొమ్మ దహనం

భైంసా, మార్చి 18 : టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను నిరసిస్తూ రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన భైంసాలో శనివారం బీజేవైఎం చేపట్టిన ఆందోళన లు హోరెత్తాయి. మధ్యాహ్నం వేళలో బీజేవైఎం ముథోల్‌ అసెంబ్లీ కన్వీనర్‌ ముల్లావార్‌ అనిల్‌, బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఎనుపోతుల మల్లేశ్వర్‌ల నేతృత్వంలో పార్టీశ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. స్థానిక విశ్రాంతి భవన ప్రాంతం నుంచి ర్యాలీగా తరలివచ్చి బస్టాండ్‌ ఎదుట ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి కేసీఅర్‌, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాల చేస్తూ ప్రదర్శనలు చేపట్టారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబోమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం ముథోల్‌ అసెంబ్లీ కన్వీనర్‌ ముల్లావార్‌ అనిల్‌, బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఎనుపోతుల మల్లేశ్వర్‌లు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి నింది తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ తన పదవికి రాజీనామా చేయా లన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాలన్నీంటిపై సిట్టింగ్‌జడ్జితో విచారణ చేపట్టాలన్నారు. ప్రభత్వుం సరియైన రీతిలో స్పందించని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా ఉపా ధ్యక్షులు తాలోడ్‌ శ్రీనివాస్‌, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి దిలీప్‌, నాయ కులు నిజాం వేణుగోపాల్‌, ఎడ్లనాగనాథ్‌, కోర్వ సచిన్‌, లక్ష్మణ్‌, గోపాల్‌ సూత్రావే, నారాయణా, వెంకటేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:32:31+05:30 IST