30న పూలాజీబాబా జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2023-08-23T01:25:31+05:30 IST

ఈ నెల 29, 30వ తేదీలలో ఉమ్మడి జిల్లాలోని జైనూర్‌ మండలం పాట్నాపూర్‌ సిద్ధేశ్వర సంస్థాన్‌లో పరమహంస సద్గురు పూలాజీ బాబా 99వ జన్మదిన మహోత్సవాలు నిర్వహిస్తున్నామని సిద్ధేశ్వర్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు, పూలాజీ బాబా తనయుడు ఇంగ్లే కేశవ్‌ తెలిపారు.

30న పూలాజీబాబా జన్మదిన వేడుకలు
పీవోకు ఆహ్వనపత్రం అందిస్తున్న కమిటీ సభ్యులు

ఉట్నూర్‌/ఇంద్రవెల్లి, ఆగస్టు 22: ఈ నెల 29, 30వ తేదీలలో ఉమ్మడి జిల్లాలోని జైనూర్‌ మండలం పాట్నాపూర్‌ సిద్ధేశ్వర సంస్థాన్‌లో పరమహంస సద్గురు పూలాజీ బాబా 99వ జన్మదిన మహోత్సవాలు నిర్వహిస్తున్నామని సిద్ధేశ్వర్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు, పూలాజీ బాబా తనయుడు ఇంగ్లే కేశవ్‌ తెలిపారు. ఈ మేరకు స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ప్రాజెక్టు అదికారి చాహత్‌బాజ్‌పాయికి ఆహ్వానపత్రం అందించి జన్మదిన మహోత్సవ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంగ్లేకేశవ్‌ మాట్లాడుతూ 29న ధ్వజారోహణ కార్యక్రమంతో జన్మదిన మహోత్సవాలు ప్రారంభిస్తామ ని, 30న ఉదయం పది గంటల నుంచి ఒంటిగంట వరకు జన్మదిన మహోత్సవం సందర్భంగా జ్యోతిప్రజ్వలన, సామూహిక ధ్యానదారణ, ప్రముఖుల కు సన్మానాలు, ప్రసంగాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అంద్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూడకైలాస్‌, జిల్లా అధ్యక్షుడు ముఖాడే విష్ణు, కమిటీ సభ్యులు డుక్రే సుభాష్‌, రాము, శీమంత్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-08-23T01:25:31+05:30 IST