చిరుధాన్యాల సాగుపై అవగాహన

ABN , First Publish Date - 2023-01-25T01:15:05+05:30 IST

మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో చిరుధాన్యాల సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ మండల అధికారి ప్రమోద్‌రెడ్డి ఆధ్వ ర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. రై తు వేదికలలో రైతులతో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. అతితక్కువ వర్షపాతం, భిన్న వాతావరణ పరిస్థితులలో సైతం అధిక దిగుబడులు ఇచ్చే చిరుధాన్యాల సాగుపై మక్కువ చూపాలని సూ చించారు. ఆహార పంటలలో అధికంగా ఉపయోగ పడే పంటగింజలు కావడంతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు.

చిరుధాన్యాల సాగుపై అవగాహన

బజార్‌హత్నూర్‌, జనవరి24: మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో చిరుధాన్యాల సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ మండల అధికారి ప్రమోద్‌రెడ్డి ఆధ్వ ర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. రై తు వేదికలలో రైతులతో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. అతితక్కువ వర్షపాతం, భిన్న వాతావరణ పరిస్థితులలో సైతం అధిక దిగుబడులు ఇచ్చే చిరుధాన్యాల సాగుపై మక్కువ చూపాలని సూ చించారు. ఆహార పంటలలో అధికంగా ఉపయోగ పడే పంటగింజలు కావడంతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు. రైతులు వచ్చే సీజన్‌లో ఈ పంటల ను సాగు చేయాలని తెలిపారు. ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారుల సలహాలు తీసుకొని సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని తెలిపారు. రైతులు ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవ సాయ విస్థీర్ణ అధికారులు సంజీవ్‌, రాము, కృష్ణపాల్‌, భోజన్న, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T01:15:06+05:30 IST