మణిపూర్‌ ఘటనపై ఆదివాసీ సంఘాల ఆందోళన

ABN , First Publish Date - 2023-07-21T22:51:59+05:30 IST

మణిపూర్‌లో ఆదివాసీ మహి ళలపై జరిగిన ఆకృత్యాలను ఖండిస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం కొండాపూర్‌ యాప వద్ద నాయకులు నిరసన చేపట్టారు. తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఆడె జంగు మాట్లాడుతూ మణిపూర్‌లో మెజార్టీ వర్గీయులైన మైతేన్‌లు మైనార్టీలైన కుకీ గిరి జన తెగలపై భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు.

మణిపూర్‌ ఘటనపై ఆదివాసీ సంఘాల ఆందోళన

కాసిపేట, జూలై 21: మణిపూర్‌లో ఆదివాసీ మహి ళలపై జరిగిన ఆకృత్యాలను ఖండిస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం కొండాపూర్‌ యాప వద్ద నాయకులు నిరసన చేపట్టారు. తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఆడె జంగు మాట్లాడుతూ మణిపూర్‌లో మెజార్టీ వర్గీయులైన మైతేన్‌లు మైనార్టీలైన కుకీ గిరి జన తెగలపై భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారానికి పాల్ప డడం హేయమైన చర్య అన్నారు. సంఘటన జరిగి నెల రోజులు గడిచినా ప్రభుత్వం, పోలీసులు స్పం దించకపోవడం బాధాకరమన్నారు. ఆదివాసీ మహిళ లపై జరిగిన ఘటనలో నిందితులను ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహిం చారు. పెంద్రం హన్మంతు వెడ్మ కిషన్‌, రాంచందర్‌, గణపతి, తిరుపతి, రాధ, మోతిరాం, పాల్గొన్నారు.

ఏసీసీ: మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగిం చిన మానవ మృగాలకు ఉరి శిక్ష వేయాలని నేతకాని మహర్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సంఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మం త్రి అమిత్‌షా రాజీనామా చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు దేశ ప్రతిష్టకే అవమానకరమన్నారు.

మందమర్రి టౌన్‌: మణిపూర్‌ రాష్ట్రంలో ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేసిన ఘనటకు కేంద్రానిదే పూర్తి బాధ్యత అని బీఆర్‌ఎస్‌ నాయకులు, యాదవ సంఘం జిల్లా అధ్యక్షు డు బండి సదానందం యాదవ్‌ తెలిపారు. ఈ ఘట న సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-07-21T22:51:59+05:30 IST