జైనూరులో విజయవంతమైన మెగా వైద్యశిబిరం

ABN , First Publish Date - 2023-02-06T22:43:20+05:30 IST

జైనూరు, ఫిబ్రవరి 6: మండలకేంద్రంలోని మార్కెట్‌కమిటీ యార్డులో సోమవారం జడ్పీచైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి జన్మదినం సందర్భంగా కోవ లక్ష్మి ఫౌండేషన్‌ జైనూరు, లింగాపూర్‌, సిర్పూర్‌(యు), కెరమెరి తదితర మండలాల రోగులకు నిర్వహిం చిన మెగా వైద్యశిబిరం విజయవంతమైంది.

జైనూరులో విజయవంతమైన మెగా వైద్యశిబిరం

జైనూరు, ఫిబ్రవరి 6: మండలకేంద్రంలోని మార్కెట్‌కమిటీ యార్డులో సోమవారం జడ్పీచైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి జన్మదినం సందర్భంగా కోవ లక్ష్మి ఫౌండేషన్‌ జైనూరు, లింగాపూర్‌, సిర్పూర్‌(యు), కెరమెరి తదితర మండలాల రోగులకు నిర్వహిం చిన మెగా వైద్యశిబిరం విజయవంతమైంది. ఫౌం డేషన్‌ తరపున హైదరాబాద్‌ నుంచివచ్చిన వైద్యు లు రోగులను పరీక్షించి మందులుపంపిణీ చేశారు. సుమారు 200మందికి పైగా రోగులను వైద్యులు పరీక్షంచారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి మాట్లాడుతూ వైద్యశిబిరం విజయవం తానికి కృషిచేసిన జిల్లా, మండల నాయ కులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, వైస్‌ఎంపీపీ లక్ష్మణ్‌, నాయకులు సయ్యద్‌ అబుతాలీబ్‌, సర్పంచ్‌ భీంరావు, నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా జడ్పీ చైర్‌పర్సన్‌ జన్మదిన వేడుకలు

వాంకిడి: మండలకేంద్రంలో సోమవారం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌కట్‌ చేసి మిఠాయి పంపణీచేశారు. ఎమ్మెల్యేగా, జడ్పీచైర్‌ పర్స న్‌గా జిల్లా ప్రజలకు ఆమె అందించిన సేవలను కొని యాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ జాబిరెపెంటు, సరండి సర్పంచు దుర్గం కమలాకర్‌, మాజీఎంపీటీసీ వినోద్‌, ఆర్‌ఎంపీ, పీఎంపీ మండల కార్యదర్శి చిందం రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T22:43:21+05:30 IST