ఆసుపత్రిని సందర్శించిన నాణ్యతా ప్రమాణాల బృందం
ABN , Publish Date - Dec 14 , 2023 | 10:08 PM
పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను గురువారం ఒరిస్సా, గుజరాత్‌కు చెందిన జాతీయ ఆరోగ్య నాణ్యత ప్రమా ణాల బృందం సభ్యులు సుభ్రజ్యోతిరావ్, ప్రదీప్‌కుమార్ చౌదరిలు సందర్శిం చారు.
మందమర్రిటౌన్, డిసెంబరు 14: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను గురువారం ఒరిస్సా, గుజరాత్‌కు చెందిన జాతీయ ఆరోగ్య నాణ్యత ప్రమా ణాల బృందం సభ్యులు సుభ్రజ్యోతిరావ్, ప్రదీప్‌కుమార్ చౌదరిలు సందర్శిం చారు. రోజువారీగా ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను వైద్యాధికారి రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ల్యాబ్ సేవలను ఆరా తీశారు. గర్భిణులకు అందించే సేవలు, ఎన్‌సీడీ కార్యక్రమాలను పరిశీలించారు. సిబ్బందితో వారు మాట్లాడుతూ ఆరోగ్య ప్రమాణాలు పాటించాలని సూచిం చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాధులతో బాధపడే వారికి మానసిక స్థయిర్యం పెంపొందించాలన్నారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉం చడంతోపాటు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాల న్నారు. జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు, ఉప వైద్యాధికారి విజయనిర్మల, రమేష్, శివ ప్రతాప్, గంగాధర్, సూపర్ వైజర్ మల్లిక, ఏఎన్‌ఎంలు అనిత, జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.