మూడు నెలల్లో బెల్లంపల్లిలో ఇల్లు నిర్మించుకుంటా
ABN , First Publish Date - 2023-12-03T23:15:22+05:30 IST
మూడు నెలల్లో పట్టణంలో ఇల్లు నిర్మించుకుని ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ అన్నారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ భారీ విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
బెల్లంపల్లి, డిసెంబరు 3 : మూడు నెలల్లో పట్టణంలో ఇల్లు నిర్మించుకుని ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ అన్నారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ భారీ విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అలాగే ఎంతో విశ్వాసంతో తనను నమ్మి ప్రజలు గెలిపించడం సంతోషంగా ఉందని, ప్రజల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతోపాటు రోడ్లు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. నాయకులు చిప్ప మనోహర్, గట్టు మురళీధర్‌రావు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.