WhatsApp: మరో అదిరిపోయే ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్.. వీరికి మాత్రం నిరాశే!

ABN , First Publish Date - 2023-02-07T21:07:57+05:30 IST

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌(WhatsApp)కు ఇటీవల వరుసపెట్టి మెరుగులు దిద్దుతున్న ఆ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్‌తో వచ్చేసింది

WhatsApp: మరో అదిరిపోయే ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్.. వీరికి  మాత్రం నిరాశే!

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌(WhatsApp)కు ఇటీవల వరుసపెట్టి మెరుగులు దిద్దుతున్న ఆ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్‌తో వచ్చేసింది. ఇప్పటి వరకు ఒకేసారి 30 మీడియా ఫైళ్ల(Media Files)ను మాత్రమే పంపుకునే వెసులుబాటు ఉండగా ఇప్పుడా పరిమితిని ఏకంగా 100కు పెంచింది. అయితే, ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ యూజర్ల(Android Users)కు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ బీటా వెర్షన్ 2.23.4.3పై దీనిని తీసుకొచ్చింది. కాబట్టి ఈ ఫీచర్ ఇప్పటి వరకు ఏనేబుల్ కాకుంటే వెంటనే ఈ సరికొత్త వెర్షన్‌తో వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌(Google Play Store)లో అప్‌డేట్ రెడీగా ఉంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకే అందుబాటులో ఉండగా త్వరలోనే దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ కనుక ఎనేబుల్ అయితే ఒకేసారి 100 మీడియా ఫైళ్లను పంపుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు మొత్తం ఆల్బమ్‌ను ఒకేసారి సులభంగా పంపించుకోవచ్చు. యూజర్లు ఒకేసారి ఎక్కువ ఫైల్స్‌ను పంపాల్సి వచ్చినప్పుడు సేమ్ ఫొటోను కానీ, వీడియోను కానీ ఒకటి కంటే ఎక్కువసార్లు పంపకుండా కూడా ఈ ఫీచర్ అడ్డుకుంటుంది.

అలాగే, దీనితోపాటు మరికొన్ని ఫీచర్లును కూడా తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. వ్యక్తిగత గ్రూపులు, చాట్‌లలో మెసేజ్‌లను పిన్ (Pin) చేసుకునే ఫీచర్ ఒకటి. ప్రస్తుతం చాట్ లిస్ట్‌లోని ఎంపిక చేసిన చాట్స్‌కు మాత్రమే పిన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు చాట్స్‌లోనూ పిన్ చేసుకోవచ్చు. ఫలితంగా యూజర్లు తమ ముఖ్యమైన చాట్లను ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధిలో ఉంది.

Updated Date - 2023-02-07T21:07:59+05:30 IST