ఓటర్లు ప్రలోభాలకు గురికావద్దు
ABN , First Publish Date - 2023-11-10T23:53:00+05:30 IST
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ శివప్రసాద్ కోరారు. మండల పరిధిలోని ఎక్వాయిపల్లి, ముద్విన్, చరికొండ, పల్లెచెలక తండాల్లో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు.

కడ్తాల్, నవంబరు 10 : ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ శివప్రసాద్ కోరారు. మండల పరిధిలోని ఎక్వాయిపల్లి, ముద్విన్, చరికొండ, పల్లెచెలక తండాల్లో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. స్థానిక సాయుధ పోలీసుల బలగాలతో కలిసి సీఐ శివప్రసాద్, ఎస్ఐ హరిశంకర్గౌడ్లు కవాతు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ పరంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటన్నట్లు తెలిపారు. స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.