Vivo: అద్భుత ఫీచర్లతో వివో స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయ్...

ABN , First Publish Date - 2023-05-30T16:19:15+05:30 IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను (Smartphones) అందుబాటులోకి తీసుకొచ్చింది.

Vivo: అద్భుత ఫీచర్లతో వివో స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయ్...

హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను (Smartphones) అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్‌లో వివో వి29 సిరీస్‌లో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. జూన్ నెలలో వివో వి29 ప్రో (Vivo V29 series) స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ,66డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది.

వివో వి29 ప్రో స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 6.7 అంగుళాల పూర్తి హెచ్‌డీ రిసొల్యూషన్, వోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ సెన్సార్, స్నాప్‌డ్రాగన్ 695 ఎస్వోసీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సదుపాయం ఉంటుంది. ఈ ఫోన్ ధర సుమారు రూ. 24,800 ఉంటుంది.

Updated Date - 2023-05-30T16:20:51+05:30 IST