Samsung: కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

ABN , First Publish Date - 2023-06-23T15:11:22+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది.

Samsung: కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోల్డబుల్ ఫోన్ ఔటర్ స్క్రీన్‌లో గూగుల్ పటాలు చూసే అవకాశం ఉంది. 1.9-అంగుళాల ఔటర్ డిస్‌ప్లేతో పోలిస్తే 3.4-అంగుళాల పెద్ద కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

జూలై నెలలో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ కవర్ డిస్‌ప్లేలో గుగూల్ మ్యాప్స్ సపోర్టు చేస్తుంది. 1.9-అంగుళాల ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్ల ధరలను విడుదల రోజు ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - 2023-06-23T15:18:30+05:30 IST