Samsung: కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లు.. గుండె పనితీరుపై అలర్ట్

ABN , First Publish Date - 2023-06-15T22:32:44+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తోంది.

Samsung: కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లు.. గుండె పనితీరుపై అలర్ట్

హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆరోగ్య సమాచారాన్ని అందించే సరికొత్త వాచ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు శాంసంగ్ తెలిపింది.

రానున్న స్మార్ట్‌వాచ్‌లు కొత్త హెల్త్ ఫీచర్‌తో అమర్చబడి ఉన్నాయని సంస్థ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్‌ 6 సిరీస్‌లో (Samsung Galaxy Watch 6 series) రెండు మోడల్‌లు ఉంటాయి. క్లాసిక్ వేరియంట్, ఐకానిక్ రొటేటింగ్ బెజెల్‌ వాచ్‌లను విడుదల చేనున్నట్లు కంపెనీ పేర్కొంది.

కొత్తగా రానున్న శాంసంగ్ వాచ్‌లు యూజర్ల గుండె పనితీరు, నిరంతర రక్తపోటు, హృదయ స్పందన రేటు, ఈసీజీ మానిటరింగ్‌తో పాటు, గుండె ఆరోగ్యాన్ని మరింత సమగ్రంగా ట్రాక్ చేయడంలో ఇది సహాయపడుతుంది. కొత్త ఫీచర్ వాచ్‌లను యూఎస్, దక్షిణ కొరియాతోపాటు 11 ఇతర దేశాల ఆరోగ్య అధికారులు ధృవీకరించారని సంస్థ తెలిపింది.

Updated Date - 2023-06-15T22:34:10+05:30 IST