Samsung: కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లు..

ABN , First Publish Date - 2023-06-17T22:47:34+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది.

Samsung: కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లు..

హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో కొరియాలోని సియోల్‌లో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు గెలాక్సీ వాచ్ 6 (Galaxy Watch 6) ప్రో, గెలాక్సీ వాచ్ 6లను శాంసంగ్ విడుదల చేయనుంది.

అయితే విడుదలకు ముందు గెలాక్సీ వాచ్ 6, వాచ్ 6 క్లాసిక్ మోడల్ వాచ్ ఫీచర్స్ లీకయ్యాయి. గెలాక్సీ వాచ్ 6 40ఎంఎం, 44ఎంఎం సైజులలో లభ్యమవుతాయని తెలిపింది. వాచ్ 6 క్లాసిక్ మోడల్ 43ఎంఎం, 47ఎంఎం సైజ్‌ రానున్నాయి. ఇవి వై-ఫై ఎల్టీఈ మోడళ్లలో అందుబాటులో ఉండవచ్చని పేర్కొంది. ధర ఎంత ఉంటుందనేది ఇంకా వెల్లడికాలేదు.

Updated Date - 2023-06-17T22:48:42+05:30 IST