Oppo A58 4G: 6.72 అంగుళాల డిస్‌ప్లేతో ఒప్పో స్మార్ట్‌ఫోన్.. ధరెంతంటే..

ABN , First Publish Date - 2023-08-08T16:24:04+05:30 IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్ప తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తోంది.

Oppo A58 4G: 6.72 అంగుళాల డిస్‌ప్లేతో ఒప్పో స్మార్ట్‌ఫోన్.. ధరెంతంటే..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఇండియా (India) మార్కెట్‌లో ఒప్పో (Oppo) ఏ58 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం ప్రాంభంలో ఇండోనేషియా మార్కెట్లో 4జీ ఫోన్లను సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం రెండు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.


6జీబీ ర్యామ్, 128జీబీ ర్యామ్ ఏ58 4జీ ఫోన్ రూ. 14,999 ఉంటుంది. రూ. 5,000తో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎలాంటి ఈఎంఐ ఛార్జీలు లేకుండా ఒప్పో ఫోన్ తీసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్ బ్యాంకు కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసిన యూజర్లకు అదనంగా డిస్కౌంట్ లభించనుంది.

Updated Date - 2023-08-08T16:42:42+05:30 IST