ఉద్యమ ద్రోహులతో కేసీఆర్‌ మిలాఖత్‌

ABN , First Publish Date - 2023-06-03T04:30:25+05:30 IST

కేసీఆర్‌ ఉద్యమ ద్రోహులతో మిలాఖత్‌ అయి పాలన చేస్తున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఉద్యమ విలువలు, ఆకాంక్షలను మరిచారని విమర్శించారు.

ఉద్యమ ద్రోహులతో  కేసీఆర్‌ మిలాఖత్‌

ఆంధ్రా కాంట్రాక్టర్లు లాభపడ్డారు: కోదండరాం

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ఉద్యమ ద్రోహులతో మిలాఖత్‌ అయి పాలన చేస్తున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఉద్యమ విలువలు, ఆకాంక్షలను మరిచారని విమర్శించారు. ఉద్యమ ద్రోహులతో పాటు ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ తన అధికారాన్ని కుటుంబ ప్రయోజనాలకే వాడుకుంటున్నారన్నారు. కేసీఆర్‌ పాలనలో ఆంధ్రా కాంట్రాక్టర్లు లాభపడ్డారని ఆరోపించారు. రాష్ట్ర సంపద, వనరుల లభ్యత మేరకు తెలంగాణ పల్లెలు అభివృద్ధి చెందలేదని చెప్పారు.

Updated Date - 2023-06-03T04:30:25+05:30 IST