సెప్టెంబరు 12 నుంచి జూనియర్‌ లెక్చరర్ల పోస్టులకు పరీక్షలు

ABN , First Publish Date - 2023-05-24T04:17:10+05:30 IST

జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను సెప్టెంబరు 12 నుంచి నిర్వహించాలని తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్ణయించింది.

సెప్టెంబరు 12 నుంచి జూనియర్‌ లెక్చరర్ల పోస్టులకు పరీక్షలు

టీఎస్‌పీఎస్సీ నిర్ణయం..

11 రోజులు జరగనున్న పరీక్షలు

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను సెప్టెంబరు 12 నుంచి నిర్వహించాలని తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సుమారు 1,392 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 9న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ) పద్ధతిలో నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టు పోస్టుకు పరీక్ష నిర్వహిస్తారు. 11 రోజులపాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు ఒకవారం ముందు హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 12న జనరల్‌ స్టడీస్‌, ఎబిలిటీస్‌, ఇంగ్లిష్‌, 13న జనరల్‌ స్టడీస్‌, బాటనీ, ఎకనామిక్స్‌, 14న జనరల్‌ స్టడీస్‌, మ్యాథ్స్‌, 20న జనరల్‌ స్టడీస్‌, కెమిస్ట్రీ, 21న జనరల్‌ స్టడీస్‌, తెలుగు, 22న జనరల్‌ స్టడీస్‌, ఫిజిక్స్‌, జంతుశాస్త్రం, 25న జనరల్‌ స్టడీస్‌, కామర్స్‌, 26న జనరల్‌ స్టడీస్‌, సివిక్స్‌, అరబిక్‌, 27న జనరల్‌ స్టడీస్‌, హిందీ, 29న జనరల్‌ స్టడీస్‌, చరిత్ర, అక్టోబరు 3న జనరల్‌ స్టడీస్‌, ఉర్దూ పరీక్షలు జరగనున్నాయి.

ఆగస్టు 8న అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ పోస్టుల పరీక్ష

పట్టణాభివృద్ధి శాఖలో అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ పోస్టుల నియామకాలకు సంబంధించిన పరీక్షను ఆగస్టు 8న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలను రెండు సెషన్లలో సీబీఆర్‌టీ పద్ధతిలో నిర్వహించనున్నారు.

Updated Date - 2023-05-24T04:17:10+05:30 IST