Apple: ఐప్యాడ్ ప్రో, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లపై భారీ తగ్గింపు

ABN , First Publish Date - 2023-06-23T18:14:02+05:30 IST

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ (Apple) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది.

Apple: ఐప్యాడ్ ప్రో, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లపై భారీ తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ (Apple) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది. యూనివర్సిటీ విద్యార్థుల కోసం ప్రమోషనల్ డీల్‌తో ముందుకు వచ్చింది. కొత్తగా "బ్యాక్ టు యూనివర్సిటీ" (Back to University) 2023 క్యాంపెయిన్‌తో ఐప్యాడ్, మ్యాక్‌బుక్స్, డెస్క్ టాప్ కంప్యూటర్స్, ఐప్యాడ్ ప్రో 11, ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాలు, ఐమ్యాక్ 24‌పై డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది.

మ్యాక్‌బుక్ ఎయిర్ 13 ప్రారంభ ధర రూ. 89,900 ఉంటుంది. ఆపిల్ ఐమాక్‌ ప్రారంభ ధర రూ.1,24,900 నుంచి అందిస్తోంది. ఈ ఆఫర్లు జూన్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు చెల్లుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. ఐప్యాడ్ ప్రో 11 రూ. 96,900 ఉండగా డిస్కౌంట్‌తో రూ. 76,900కే లభించనుంది. 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రో ప్రారంభ ధర రూ. 1,12,900 ఉండగా, డిస్కౌంట్‌తో రూ. 1,02,900కే రానుంది. ఐప్యాడ్ ఎయిర్ రూ. 59,900 ఉండగా, రూ. 54,900కే లభించనుంది.

Updated Date - 2023-06-23T18:15:13+05:30 IST