WPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ABN , First Publish Date - 2023-03-26T19:45:07+05:30 IST

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)తో తలపడుతోంది.

WPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)తో తలపడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది.

ఈ టోర్నమెంట్‌లో మొదటి ఐదు మ్యాచ్‌లను గెలవడం ద్వారా ముంబై ఇండియన్స్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా టైటిల్ పోరులో హాట్ ఫేవరేట్‌(Hot favourite)గా నిలిచింది. లీగ్ దశలో ఆరు విజయాలు, 12 పాయింట్లతో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్ రన్‌రేట్ ద్వారా పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచి టైటిల్ పోరుకు సిద్ధమైంది.

ముంబై ఇండియన్స్ జట్టు: యస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(c), మెలీ కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్

ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ జట్టు: మెగ్ లానింగ్(కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాసెన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్, శిఖా పాండే, మిన్నుమణి.

Updated Date - 2023-03-26T19:45:18+05:30 IST