Sania Mirza: గ్రాండ్‌స్లామ్ ఓటమితో కన్నీరుమున్నీరైన సానియామీర్జా

ABN , First Publish Date - 2023-01-27T09:50:43+05:30 IST

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఓటమి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు....

Sania Mirza: గ్రాండ్‌స్లామ్ ఓటమితో కన్నీరుమున్నీరైన సానియామీర్జా
Sania Mirza broke down in tears

మెల్‌బోర్న్‌ : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఓటమి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు.(Sania Mirza) భారతదేశంలోని అత్యుత్తమ క్రీడాకారిణుల్లో ఒకరైన సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో(Mixed Doubles Final) ఓడిపోవడంతో శుక్రవారం తన గ్రాండ్‌స్లామ్ ప్రయాణానికి ముగింపు పలికారు. విజయం సాధించిన బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ,రఫెల్ మాటోస్((Luisa Stefani, Rafael Matos) జంటను సానియా మీర్జా అభినందించారు. అనంతరం తన టెన్నిస్ ప్రయాణం గురించి మాట్లాడుతూ సానియా కన్నీళ్లు(Tears) పెట్టుకున్నారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023తో తన గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని ముగించుకుంటున్నట్లు సానియా ఇప్పటికే ప్రకటించారు.‘‘నా వృత్తిపరమైన కెరీర్ మెల్బోర్న్‌లో ప్రారంభమైంది.నా కొడుకు ముందు నేను గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో ఆడగలనని ఎప్పుడూ అనుకోలేదు’’ అని సానియా వ్యాఖ్యానించారు.వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్‌లో సానియా తన చివరి టోర్నమెంట్‌ను ఆడనున్నారు.

సానియా కెరీర్‌లో ఇది 11వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్. ఆమె ఆరు గ్రాండ్ స్లామ్‌లతో సహా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. గతంలో మహిళల డబుల్స్ విభాగంలో 91 వారాల పాటు డబ్ల్యూటీఏ నంబర్ 1 ప్లేయర్‌గా సానియా నిలిచారు.

Updated Date - 2023-01-27T10:27:31+05:30 IST