ప్రణయ్‌ కెరీర్‌ బెస్ట్‌ @ 6

ABN, First Publish Date - 2023-08-30T03:55:32+05:30 IST

వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో కాంస్యం సాధించిన షట్లర్‌ హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ కెరీర్‌ బెస్ట్‌ ఆరో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం తాజాగా విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్‌

న్యూఢిల్లీ: వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో కాంస్యం సాధించిన షట్లర్‌ హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ కెరీర్‌ బెస్ట్‌ ఆరో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం తాజాగా విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్‌ మూడు స్థానాలు ఎగబాకాడు. లక్ష్యసేన్‌ 12వ స్థానంలో, కిడాంబి శ్రీకాంత్‌ 20వ ర్యాంక్‌లో నిలిచారు. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో తొలి రౌండ్‌లోనే ఓడినా ఒక మెట్టెక్కిన పీవీ సింధు 14వ ర్యాంక్‌ దక్కించుకొంది. డబుల్స్‌ టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి రెండో ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. మహిళల జంట ట్రీసా జాలీ-గాయత్రి పుల్లెల రెండు స్థానాలు మెరుగుపరచుకొని 17వ ర్యాంక్‌లో నిలిచింది.

Updated at - 2023-08-30T03:55:32+05:30