Ishan Kishan: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ఇషాన్ దూరం.. తెలుగు కుర్రాడికి చోటు..
ABN , Publish Date - Dec 17 , 2023 | 06:16 PM
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల గాయం కారణంగా పేసర్ మహ్మద్ షమీ టెస్ట్ సిరీస్‌కు దూరం కాగా, తాజాగా ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో వైదొలిగాడు. వ్యక్తిగత సమస్యల కారణంగా తాను ఈ టెస్ట్ సిరీస్‌ను ఆడలేనని ఇషాన్ కిషన్ విజ్ఞప్తి చేశాడు.
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు (Test Series) ముందు టీమిండియాకు (Team India) మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల గాయం కారణంగా పేసర్ మహ్మద్ షమీ టెస్ట్ సిరీస్‌కు దూరం కాగా, తాజాగా ఇషాన్ కిషన్ (Ishan Kishan) వ్యక్తిగత కారణాలతో వైదొలిగాడు. వ్యక్తిగత సమస్యల కారణంగా తాను ఈ టెస్ట్ సిరీస్‌ను ఆడలేనని ఇషాన్ కిషన్ విజ్ఞప్తి చేయడంతో బీసీసీఐ (BCCI) అతడిని తప్పించింది. ఇషాన్ స్థానంలో తెలుగు కుర్రాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్ (KS Bharat) జట్టుతో చేరబోతున్నాడు. అయితే ఇషాన్ వ్యక్తిగత సమస్య ఏంటనేది మాత్రం బయటకు రాలేదు.
ఇటీవల దక్షిణాఫ్రికాతో (South Africa) టీ-20 సిరీస్ ఆడిన టీమిండియా ప్రస్తుతం వన్డే సిరీస్‌లో తలపడుతోంది. ఇది పూర్తి కాగానే ఈ నెల 26 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. కాగా, టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన కేఎస్ భరత్‌కు తుది జట్టులో స్థానం దొరికేది అనుమానమే. ఎందుకంటే టీమిండియా మొదటి ప్రాధాన్య కీపర్ కేఎల్ రాహుల్. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ వికెట్ల వెనుక అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌నే కీపర్‌గా టెస్ట్ సిరీస్‌లో కొనసాగించే అవకాశం కనబడుతోంది.