Share News

World Cup: సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ ఎలా ఆడుతుంది? ఆ జట్టు గత చరిత్రను గమనిస్తే బయటపడిన ఆసక్తికర అంశం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-11-13T20:59:42+05:30 IST

కొద్ది రోజులగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ప్రపంచకప్ అతి కీలక దశకు చేరుకుంది. లీగ్ దశ పూర్తి కావడంతో టాప్-4 జట్లు సెమీ ఫైనల్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రపంచకప్‌లో అన్ని జట్లనూ ఓడించిన టీమిండియా బుధవారం జరగబోయే మొదటి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టబోతోంది.

World Cup: సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ ఎలా ఆడుతుంది? ఆ జట్టు గత చరిత్రను గమనిస్తే బయటపడిన ఆసక్తికర అంశం ఏంటంటే..

గత కొద్ది రోజులగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ప్రపంచకప్ (World Cup2023) అతి కీలక దశకు చేరుకుంది. లీగ్ దశ పూర్తి కావడంతో టాప్-4 జట్లు సెమీ ఫైనల్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రపంచకప్‌లో అన్ని జట్లనూ ఓడించిన టీమిండియా బుధవారం జరగబోయే మొదటి సెమీ-ఫైనల్ (Semi-final)మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ (New Zealand)ను ఢీకొట్టబోతోంది. తర్వాతి రోజు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోని విజేతలు 19వ తేదీన జరగబోయే ఫైనల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటారు (India vs New Zealand).

బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోయే మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ టోర్నీ‌లో భారత్‌ను కాస్త కష్టపెట్టింది కివీ జట్టు మాత్రమే. ఆ టీమ్‌తోనే సెమీ-ఫైనల్ ఆడాల్సి రావడంతో టీమిండియా ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురవుతున్నారు. అయితే కొన్నేళ్లుగా వరల్డ్ కప్ కీలక మ్యాచ్‌ల్లో కివీ జట్టు ప్రదర్శన చూస్తే మాత్రం టీమీండియా అభిమానులు పండగ చేసుకోవచ్చు. తాజాగా న్యూజిలాండ్ టీమ్ గురించి ఓ ఆసక్తికర రికార్డు బయటకు వచ్చింది. 2011 నుంచి చూస్తే ప్రపంచ కప్‌లలో ముఖ్యమైన మ్యాచ్‌లలో ఆతిథ్య దేశాలపై న్యూజిలాండ్ ఎప్పుడూ గెలవలేదు.

2011 వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో కివీ జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో న్యూజిలాండ్‌ పరాజయం పాలైంది. 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ టీమ్ న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌లో భారత్‌తో న్యూజిలాండ్ పోటీపడుతోంది. గత చరిత్రను బట్టి చూస్తే ఆతిథ్య భారత్ చేతిలో కివీస్‌కు భంగపాటు తప్పేలా లేదు. ఈ సెంటిమెంట్ సంగతి పక్కన పెడితే ప్రస్తుత టీమిండియా అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తోంది. రోహిత్ సేన ఇదే ఫామ్ కొనసాగించి మరో రెండో మ్యాచ్‌ల్లో కూడా గెలిచి ప్రపంచకప్ అందుకోవాలని ఆశిద్దాం.

Updated Date - 2023-11-13T20:59:44+05:30 IST