Virat Kohli: సచిన్ రికార్డు త్రుటిలో మిస్.. అసలు 90ల్లో కోహ్లీ ఎన్ని సార్లు అవుట్ అయ్యాడంటే..
ABN , First Publish Date - 2023-10-23T12:08:11+05:30 IST
ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని న్యూజిలాండ్‌కు కూడా టీమిండియా చెక్ పెట్టింది. ఆదివారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా ``కింగ్`` కోహ్లీ తన క్లాస్ చూపించాడు.
ప్రస్తుత ప్రపంచకప్‌లో (World Cup2023) భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని న్యూజిలాండ్‌కు కూడా టీమిండియా (India vs New Zealand) చెక్ పెట్టింది. ఆదివారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా ``కింగ్`` కోహ్లీ (Virat Kohli) తన క్లాస్ చూపించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా బాధ్యతాయుతంగా ఆడుతూ మరోసారి ఛేజింగ్ మాస్టర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికీ అభిమానులకు నిరాశ కలిగించిన అంశం ఏదైనా ఉందంటే అది కోహ్లీ 5 పరుగుల దూరంలో సెంచరీ (Kohli Century)కోల్పోవడమే.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేసి ఉంటే సచిన్ (Sachin Record) 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేసేవాడు. అయితే అనూహ్యంగా కోహ్లీ 95 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఇప్పటివరకు టెస్ట్‌లు, వన్డేలు, టీ-20లు కలిపి భారత్ తరఫున కోహ్లీ మొత్తం 512 మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో 78 శతకాలు బాదాడు. అయితే పలు మ్యాచ్‌ల్లో కోహ్లీ 90ల్లో అవుటయ్యాడు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 8 సార్లు 90ల్లో అవుటయ్యాడు. అందులో 6 సార్లు వన్డేల్లో, 2 సార్లు టెస్ట్‌ల్లో 90ల్లో ఉండగా పెవిలియన్ చేరాడు.
ఏదేమైనా ఆదివారం కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అతడి కెరీర్లో మరో ముఖ్యమైన ఇన్నింగ్స్. ప్రపంచకప్‌లో దాదాపు 20 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌పై భారత్‌ను గెలిపించిన ఇన్నింగ్స్ అది. 104 బంతుల్లో 95 పరుగులు చేసి టీమిండియాకు కోహ్లీ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్ర స్థానానికి చేరుకుంది.