టాప్‌-10లో మనోళ్లు ముగ్గురు 2019 తర్వాత మళ్లీ ఇప్పుడే!

ABN , First Publish Date - 2023-09-14T01:23:02+05:30 IST

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌కు ఎగబాకగా..

టాప్‌-10లో మనోళ్లు ముగ్గురు  2019 తర్వాత మళ్లీ ఇప్పుడే!

గిల్‌ 28 ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌కు ఎగబాకగా.. మొత్తం ముగ్గురు టీమిండియా బ్యాటర్లు టాప్‌-10లో చోటు దక్కించుకోవడం విశేషం. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ వరుసగా 8.9 స్థానాల్లో నిలిచారు. చివరిసారిగా 2019లో రోహిత్‌, కోహ్లీతోపాటు శిఖర్‌ ధవన్‌ ఇలా తొలి 10 ర్యాంక్‌ల్లో నిలిచారు. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో అదరగొట్టిన గిల్‌ ఓ మెట్టెక్కి రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకొన్నాడు. ఇక ఆడిన మూడు వన్డేల్లో వరుసగా మూడు హాఫ్‌ సెంచరీలు సాధించిన శర్మ.. విరాట్‌ను వెనక్కునెట్టి 8వ స్థానంలో నిలిచాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో కుల్దీప్‌ యాదవ్‌ ఓ స్థానం మెరుగుపరచుకొని ఏడో ర్యాంక్‌ కైవసం చేసుకోగా.. సిరాజ్‌ 9వ స్థానంలో నిలకడగా ఉన్నాడు. ఆల్‌రౌండర్ల కేటగిరీలో హార్దిక్‌ పాండ్యా ఓ ర్యాంక్‌ ఎగబాకి ఆరో స్థానానికి చేరాడు.

Updated Date - 2023-09-14T01:23:36+05:30 IST