England Test: ఇంగ్లండ్‌దే చివరి టెస్టు

ABN , First Publish Date - 2023-08-01T04:12:22+05:30 IST

యాషెస్‌ ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 49 పరుగులతో ఘన విజయం సాధించింది.

England Test: ఇంగ్లండ్‌దే చివరి టెస్టు

ఐదో టెస్ట్‌లో ఆసీస్‌ ఓటమి

బ్రాడ్‌కు ఘన వీడ్కోలు

2-2తో యాషెస్‌ సిరీస్‌ డ్రా

ఆఖరి ‘రెండు’ బ్రాడ్‌వే..

లండన్‌: యాషెస్‌ ఐదో టెస్ట్‌(Fifth test)లో ఇంగ్లండ్‌(England) 49 పరుగులతో ఘన విజయం సాధించింది. నాలుగో టెస్ట్‌ మాదిరి..ఈ మ్యాచ్‌లోనూ వరుణుడు తమ విజయానికి అడ్డుపడతాడని ఆతిథ్య జట్టు ఆందోళన చెందింది. కారణం, లంచ్‌ విరామం తర్వాత వర్షంతో ఆటకు మూడు గంటలు అంతరాయం కలిగింది. ఇక, సోమవారం ఆట తిరిగి మొదలవగా...ఆపై చకచకా వికెట్లు తీసిన ఇంగ్లండ్‌ బౌలర్లు జట్టుకు విజయం అందించారు. దాంతో 384 పరుగుల ఛేదనలో 135/0తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ 334 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్‌లో ఖవాజా (72), వార్నర్‌ (60), మిడిల్డార్‌లో స్మిత్‌ (54), హెడ్‌ (43) పోరాడారు.

చివర్లో అలెక్స్‌ కేరీ (28) ఇంగ్లండ్‌ గెలుపును కొంత ఆలస్యం చేశాడు. క్రిస్‌ వోక్స్‌ (4/50) నాలుగు, మొయిన్‌ అలీ (3/76) మూడు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 283, ఇంగ్లండ్‌ 295 పరుగులు చేయగా, ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 395 రన్స్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఐదు టెస్ట్‌ల సిరీ్‌సను స్టోక్స్‌ సేన 2-2తో సమం చేసింది. దాంతో 2001 తర్వాత తమ గడ్డపై ఆస్ట్రేలియా జట్టు యాషెస్‌ సిరీస్‌ నెగ్గకుండా ఇంగ్లండ్‌ నిలువరించింది. అయితే నాలుగో టెస్ట్‌ డ్రా కావడంతో ట్రోఫీని మాత్రం కంగారూలే దక్కించుకున్నారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పేసర్‌ బ్రాడ్‌కు ఈ విజయంతో ఇంగ్లండ్‌ ఘనమైన వీడ్కోలు ఇచ్చింది.

ఈ టెస్టుతో క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఆఖరి మ్యాచ్‌లో రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు. కేరీ, మర్ఫీ తొమ్మిది వికెట్‌కు 35 పరుగులు జోడించి ‘కంగారె’త్తిస్తుండగా మర్ఫీ (18)ని అవుట్‌ చేసిన బ్రాడ్‌ జట్టుకు ఊరటనిచ్చాడు. ఆపై ఓ చక్కటి బంతితో కేరీని కూడా పెవిలియన్‌ చేర్చిన బ్రాడ్‌..తన ఆఖరి మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. మొత్తంగా ఆఖరి టెస్ట్‌లో అతడు 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లంతా బ్రాడ్‌ను ఆలింగనం చేసుకొని వీడ్కోలు ఇచ్చారు. కాగా, 37 ఏళ్ల బ్రాడ్‌ 167 టెస్టుల్లో 604 వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2023-08-01T05:00:38+05:30 IST