IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్..

ABN , First Publish Date - 2023-05-20T19:54:10+05:30 IST

ఐపీఎల్-16, (IPL2023)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై (Delhi Capitals) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఘన విజయం సాధించింది.

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్..

ఢిల్లీ: ఐపీఎల్-16, (IPL2023)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై (Delhi Capitals) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఘన విజయం సాధించింది. 77 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై గెలుపొందింది. ఈ గెలుపుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎంఎస్ ధోని జట్టు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. అయితే తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై భారీ స్కోర్ చేసింది.

20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ 223 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ చెన్నై భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన భారీ టార్గెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ చేరుకోలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్‌ 146 పరుగులు మాత్రమే చేసింది. ఐపీఎల్-16, (IPL2023)లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 67వ మ్యాచ్ జరిగింది.

Updated Date - 2023-05-20T20:30:57+05:30 IST