Share News

Shubman Gill: సారా టెండూల్కర్‌తో కాదు.. లండన్‌లో ఈ నటితో శుభ్‌మన్ గిల్ చెట్టాపట్టాల్

ABN , First Publish Date - 2023-12-05T17:24:36+05:30 IST

ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌ శుభ్‌మన్ గిల్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే వార్తలు చాలాకాలం నుంచి చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలుసు.

Shubman Gill: సారా టెండూల్కర్‌తో కాదు.. లండన్‌లో ఈ నటితో శుభ్‌మన్ గిల్ చెట్టాపట్టాల్

Shubman Gill With Another Actress: ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌ శుభ్‌మన్ గిల్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే వార్తలు చాలాకాలం నుంచి చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలుసు. పలు మ్యాచ్‌లకు సారా ఒక్కతే ప్రత్యేకంగా హాజరై, శుభ్‌మన్ మద్దతు తెలపడంతో.. ఆ వాదనలకు మరింత బలం చేకూరింది. ఒకసారి పార్టీకి వెళ్లి, వీళ్లు కెమెరాకి అడ్డంగా దొరికిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో.. వీళ్లిద్దరు డేటింగ్‌లో ఉన్నారని దాదాపు ఖరారయ్యింది. డేటింగ్ వార్తలపై వాళ్లిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు కానీ, అనధికారికంగా మాత్రం వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న ప్రచారం జోరుగా నడుస్తోంది.


ఇలాంటి తరుణంలో.. లండన్ వీధుల్లో శుభ్‌మన్ గిల్ మరో నటితో కెమెరాకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ఆ నటి మరెవ్వరో కాదు.. తన అందచందాలతో, హాట్ ఫోటోషూట్‌లతో యువత మనసుల్ని దోచుకుంటున్న అవనీత్ కౌర్. ఈ అమ్మడితో శుభ్‌మన్ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు నెట్టింట్లో దర్శనమిచ్చాయి. అయితే.. ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్లే పర్సనల్ టూర్‌కి వెళ్లలేదు. ప్రొఫెషనల్ వర్క్ కోసమే అక్కడికి వెళ్లారు. ఆ ఫోటోల్లో వారిద్దరితో పాటు రాఘవ్ శర్మ, అన్షుల్ గార్గ్ ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. వీరిలో రాఘవ్ శర్మ ఒక నిర్మాత. అతనితో అవనీత్ కౌర్ డేటింగ్‌లో ఉంది. చూస్తుంటే.. వీళ్లు లండన్‌లో ఏదో మ్యూజిక్ వీడియో చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. శుభ్‌మన్ గిల్ ఆ మ్యూజిక్ వీడియోలో నటిస్తున్నాడా? లేదా? అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఒకవేళ శుభ్‌మన్ కూడా ఈ మ్యూజిక్ వీడియోలో భాగమైతే మాత్రం.. అతనికున్న క్రేజ్‌తో ఈ పాట బంపర్ హిట్ అవ్వడం ఖాయం.

ఇక్కడే శుభ్‌మన్ గురించి మరో విషయం చెప్పుకోవాలి. అతడు ఇదివరకే ఈ ఏడాది మే నెలలో విడుదలైన ‘స్పైడర్‌మ్యాన్’ సినిమాలోని పవిత్ర ప్రభాకర్ పాత్రకు తన గాత్రాన్ని అందించాడు. హిందీలో తన వాయిస్ ఇవ్వగా.. అందుకు తారాస్థాయిలో అతనికి ప్రశంసలు వచ్చిపడ్డాయి. నిజంగా అతడు అద్భుతమైన పనితనం కనబరిచాడని.. సినీ పరిశ్రమలోనూ రాణించే సత్తా అతనికి ఉందని కొనియాడారు. అందుకేనేమో.. సినిమా ఫీల్డ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శుభ్‌మన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది.

Updated Date - 2023-12-05T17:24:38+05:30 IST