RCB vs GG: మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో కీలక మ్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

ABN , First Publish Date - 2023-03-18T19:47:53+05:30 IST

మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. పాయింట్ల పట్టికలో కింది నుంచి

RCB vs GG: మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో కీలక మ్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. పాయింట్ల పట్టికలో కింది నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Banglore) మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఆరేసి మ్యాచ్‌లు ఆడాయి. గుజరాత్ రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో కింది నుంచి రెండో స్థానంలో ఉండగా, అన్నే మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు జట్టు ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉంది.

ఈ మ్యాచ్‌లో కనుక గుజరాత్ విజయం సాధిస్తే ఆరు పాయింట్లతో మెరుగైన రన్‌రేట్ కారణంగా మూడో స్థానానికి చేరుకుంటుంది. ఆర్సీబీ కనుక గెలిస్తే గుజరాత్ కిందికి పడిపోతుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమే. గత మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి విజయాల వేట ప్రారంభించాలని గట్టి పట్టుదలగా ఉంది. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిశాయి. గుజరాత్ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఓపెనర్ సోఫియా డంక్లీ 10 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి జోరు చూపించినప్పటికీ ఎంతోసేపు క్రీజులో కుదురుకోలేకపోయింది. డివైన్ బౌలింగులో బౌల్డయింది.

Updated Date - 2023-03-18T19:47:53+05:30 IST