IPL 2023: బెంగళూరుపై టాస్ గెలిచిన లక్నో.. ఏం ఎంచుకుందంటే?

ABN , First Publish Date - 2023-04-10T19:18:43+05:30 IST

ఇక్కడి ఎం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు(RCB)తో జరగనున్న మ్యాచ్‌లో లక్నో సూపర్

IPL 2023: బెంగళూరుపై టాస్ గెలిచిన లక్నో.. ఏం ఎంచుకుందంటే?

బెంగళూరు: ఇక్కడి ఎం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు(RCB)తో జరగనున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో జట్టు ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, రెండు మ్యాచ్‌లు ఒక విజయం సాధించిన బెంగళూరు జట్టు ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని బెంగళూరు భావిస్తోంది. లక్నో కనుక నేటి మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

డుప్లెసిస్ సేన గత మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో 81 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. కాబట్టి నేటి మ్యాచ్‌లో లక్నోను ఓడించడం ద్వారా బౌన్స్ బ్యాక్ కావాలని యోచిస్తోంది. మరోవైపు, సన్‌రైజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో లక్నో ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఊపు మీదుంది. అదే జోరును ఆర్సీబీపైనా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది.

Updated Date - 2023-04-10T19:18:43+05:30 IST