MS Dhoni Cricket: మన దేశంలో క్రికెట్‌ని ఒక మతంగా భావించేది ఇందుకేనేమో!.. టీవీ ముందు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

ABN , First Publish Date - 2023-04-03T19:38:43+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడలు ఉన్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో గేమ్‌కు క్రేజ్. కొన్ని

 MS Dhoni Cricket: మన దేశంలో క్రికెట్‌ని ఒక మతంగా భావించేది ఇందుకేనేమో!.. టీవీ ముందు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడలు ఉన్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో గేమ్‌కు క్రేజ్. కొన్ని చోట్ల ఫుట్‌బాల్ అంటే అభిమానులు ఎగిరి గంతేస్తారు. మరికొన్ని చోట్ల టెన్నిస్. ఇంకోచోట ఇంకోటి. అయితే, కామన్‌గా అభిమానులను కలిగినది క్రికెట్ ఒక్కటే. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

సర్ డాన్ బ్రాడ్‌మన్, క్లైవ్ లాయిడ్, రిచర్డ్స్, లారా, కపిల్, సచిన్ సహా మరెందరో ఆటగాళ్లు తమ ఆటతీరుతో క్రికెట్‌కు వన్నె తీసుకొచ్చారు. టీమిండియాకు ధోనీ(MS Dhoni) దొరికాక క్రేజ్ క్రికెట్‌పై క్రేజ్ మరింత పెరిగింది. జట్టుకు వరుస విజయాలు అందిస్తూ తిరుగులేని కెప్టెన్‌గా అవతరించాడు. టీ20, వన్డే ప్రపంచకప్‌లు అందించి క్రికెట్‌లోని అసలైన మజాను రుచి చూపించాడు.

ధోనీ ఆటతీరుకు, అతడు కొట్టే హెలికాప్టర్ షాట్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పుట్టుకొచ్చారు. క్రికెట్‌ను ఓ మతంలా భావించే భారత్‌లో ధోనీ రాకతో అది మరింత పెరిగింది. ఎంఎస్ తన ఆటతీరుతో టీమిండియా(Team India)కే కాదు.. ఐపీఎల్‌లోనూ తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)కు తిరుగులేని విజయాలు అందించిపెట్టాడు. చెన్నై అభిమానులకు ధోనీ అంటే పిచ్చి. ధోనీని వారు తలైవా అని ముద్దుగా పిలుచుకుంటారు. ధోనీకున్న క్రేజ్ అలాంటిది మరి.

ధోనీని పిచ్చిగా అభిమానించే తమిళనాడులోని కడలూరు జిల్లా అరంగూరుకు చెందిన గోపీ కృషన్ మూడేళ్ల క్రితం తన ఇంటిని చెన్నై జట్టు జెర్సీ కలర్ అయిన పసుపు రంగులోకి పూర్తిగా మార్చేసి ధోనీ ఫ్యాన్ ఇల్లు అని రాయించాడు. తాజాగా మరో అభిమానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Viral Video)లో వైరల్ అవుతోంది. లక్నోతో మ్యాచ్‌కు ముందు ఓ యువకుడు టీవీలో మాట్లాడుతున్న ధోనీకి హారతి ఇస్తూ ఈ మ్యాచ్‌లో గెలవాలని ప్రార్థించాడు. మరి అతడి ప్రార్థనలు ఫలించి ఈ మ్యాచ్‌తో చెన్నై బోణీ కొడుతుందో, లేదో చూడాలి.

Updated Date - 2023-04-03T19:38:43+05:30 IST