IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. చెన్నై ఈ మ్యాచ్‌లోనైనా..

ABN , First Publish Date - 2023-04-03T19:18:59+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ (IPL 2023) 6వ మ్యాచ్‌లో

IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. చెన్నై ఈ మ్యాచ్‌లోనైనా..

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ (IPL 2023) 6వ మ్యాచ్‌లో లక్నో సూజర్ జెయింట్స్ (LSG) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ కేపిటల్స్‌(DC)పై తాము చక్కని ప్రదర్శన కనబరిచామని, ఇక్కడ కూడా అదే జోరు కొనసాగిస్తామని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అన్నాడు. బౌలింగ్ ఎంచుకోవడం ద్వారా తామెంత వరకు ఛేదించగలమో అంచనా వేసుకుంటామన్నాడు. అన్ని విభాగాల్లోనూ తాము పటిష్ఠంగా ఉన్నామన్నాడు. ఈ రోజు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పాడు. జయదేవ్ ఉనద్కత్ స్థానంలో యశ్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చినట్టు చెప్పాడు.

ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత 5-6 సీజన్లు మాత్రమే ఈ స్టేడియంలో ఆడామని చెన్నై కెప్టెన్ ధోనీ(MS Dhoni) పేర్కొన్నారు. అప్పట్లో కొన్ని స్టాండ్స్ ఖాళీగా ఉండేవని, ఈసారి ప్రేక్షకులతో నిండిపోయినట్టు చెప్పాడు. చేపాక్‌లో తమ అభిమానుల ముందు ఆడబోతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.

Updated Date - 2023-04-03T19:18:59+05:30 IST