Share News

IND vs AUS: తడాఖా చూపిస్తున్న భారత బౌలర్లు.. కష్టాల్లో ఆస్ట్రేలియా జట్టు

ABN , First Publish Date - 2023-11-19T19:15:13+05:30 IST

అనుకున్నదే జరుగుతోంది.. భారత బౌలర్లు తడాకా చూపిస్తున్నారని భావించినట్టే విజృంభిస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు ‘కంగారు’ పెట్టించేస్తున్నారు. అవును.. మొదట్లో పరుగులు సమర్పించుకున్నారు కానీ..

IND vs AUS: తడాఖా చూపిస్తున్న భారత బౌలర్లు.. కష్టాల్లో ఆస్ట్రేలియా జట్టు

అనుకున్నదే జరుగుతోంది.. భారత బౌలర్లు తడాకా చూపిస్తున్నారని భావించినట్టే విజృంభిస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు ‘కంగారు’ పెట్టించేస్తున్నారు. అవును.. మొదట్లో పరుగులు సమర్పించుకున్నారు కానీ, ఆ వెంటనే తేరుకొని వికెట్లు పడగొడుతున్నారు. ఎప్పట్లాగే ఈసారి కూడా అంచనాల్ని అందుకుంటూ.. మహమ్మద్ షమీ తొలి వికెట్ తన తొలి ఓవర్‌లోని తొలి బంతికే (అంతకుముందు బంతి వైడ్ వెళ్లింది) వార్నర్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అతడు పోయాక వచ్చిన మిచెల్ మార్ష్.. రావడం రావడంతోనే ఖాతా తెరిచాడు. ఒక సిక్స్, మరో ఫోర్‌తో చేలరేగిపోయాడు. అప్పుడు బుమ్రా అతని దూకుడికి కళ్లెం వేశాడు. ఇక ఆడింది చాలు, పెవిలియన్‌కి వెళ్లు అంటూ.. ఔట్ చేశాడు.

బుమ్రా వేసిన స్లో బాల్‌ని సరిగ్గా పసిగట్టలేకపోయిన మిచెల్ మార్ష్.. కీపర్ కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 9 బంతుల్లో కేవలం నాలుగు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. అతని వికెట్ పడగొట్టింది కూడా మన బూమ్ బూమ్ బుమ్రానే. తన మ్యాజికల్ స్పెల్‌తో స్మిత్‌ని కట్టడి చేసి, ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేసేశాడు. అంపైర్ ఔట్ ఇవ్వగానే.. రివ్యూ కూడా తీసుకోకుండానే స్మిత్ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. 47 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు పడిపోయి.. కష్టాల్లో పడింది. మన భారత బౌలర్లు ఇదే జోరుని కొనసాగిస్తే.. ఈ మ్యాచ్ గెలవడం నుంచి భారత జట్టుని ఏ ఒక్కరూ ఆపలేరు. మన టీమిండియా గెలుపొందాలని అందరం ప్రార్థిద్దాం.

Updated Date - 2023-11-19T19:15:14+05:30 IST