Cricket News: అప్పుడు జియో.. ఇప్పుడు హాట్‌స్టార్.. వ్యూయర్ షిప్‌లో రికార్డులు

ABN , First Publish Date - 2023-09-12T14:34:37+05:30 IST

ఐపీఎల్‌కు సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్‌కు దక్కిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హాట్ స్టార్ కూడా ఆసియా కప్ మ్యాచ్‌లను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో క్రికెట్ అభిమానులు హాట్ స్టార్ ద్వారా తమకు ఇష్టమైన మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. సూపర్-4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. ఈ మ్యాచ్‌ను దాదాపు 2.8 కోట్ల మంది హాట్ స్టార్ ద్వారా చూసినట్లు స్పష్టమైంది.

Cricket News: అప్పుడు జియో.. ఇప్పుడు హాట్‌స్టార్.. వ్యూయర్ షిప్‌లో రికార్డులు

క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుంటే ఒకప్పుడు అభిమానులు ప్రత్యక్ష ప్రసారాల కోసం టీవీలు చూసేవాళ్లు. ప్రస్తుతం కాలం మారింది. క్రికెట్ మ్యాచ్ లైవ్‌లను మొబైల్‌లో చూసేందుకే అందరూ ఇష్టపడుతున్నారు. దీంతో శాటిలైట్ హక్కుల కంటే డిజిటల్ రైట్స్‌పైనే మీడియా సంస్థలు కూడా ఎక్కువ ఖర్చుపెడుతున్నాయి. ఇటీవల ఐపీఎల్ కోసం శాటిలైట్, డిజిటల్ హక్కులను బీసీసీఐ వేర్వేరుగా వేలం వేయగా.. శాటిలైట్ హక్కులను స్టార్ ఇండియా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలయన్స్ జియో భారీ ధర వెచ్చించి దక్కించుకున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లను టీవీలో కంటే మొబైల్‌లోనే ఎక్కువ మంది వీక్షించారు. ముఖ్యంగా ధోనీ ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ల ప్రసార సమయంలో సుమారు 2.5 కోట్ల మంది జియో యాప్‌ ద్వారా వీక్షించారు. అది అప్పట్లో రికార్డు అని అందరూ చెప్పుకున్నారు.

ఇది కూడా చదవండి: ODI Cricket: వన్డేల్లో 13వేల పరుగులు చేసిన కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలు

ఐపీఎల్‌కు సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్‌కు దక్కిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హాట్ స్టార్ కూడా ఆసియా కప్ మ్యాచ్‌లను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో క్రికెట్ అభిమానులు హాట్ స్టార్ ద్వారా తమకు ఇష్టమైన మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. సూపర్-4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. ఈ మ్యాచ్‌ను దాదాపు 2.8 కోట్ల మంది హాట్ స్టార్ ద్వారా చూసినట్లు స్పష్టమైంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని హాట్ స్టార్ వెల్లడించింది. గత ఏడాది టీ20 ప్రపంచకప్ సమయంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను కేవలం 80 లక్షల మంది మాత్రమే వీక్షించారు. ఇప్పుడు ఈ వ్యూయర్ షిప్ దాదాపు ట్రిపుల్ అయ్యింది. దీనికి కారణం ఉచితంగా హాట్ స్టార్‌లో మ్యాచ్‌ను చూసే అవకాశం కల్పించడమే అని తెలుస్తోంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు దాయాదులు తలపడుతుంటే ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేవాళ్లు. అయితే ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఉండటంతో ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు ఉన్నా అందరూ మొబైల్ ద్వారా మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Updated Date - 2023-09-12T14:52:32+05:30 IST