IND vs NZ: కివీస్‌ వన్డేలో గిల్ సింహ గర్జన.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2023-01-18T17:56:39+05:30 IST

ఆ కుర్రాడి వయసు 23 సంవత్సరాలు. ఒక్క మ్యాచ్‌తో రికార్డుల మీద రికార్డులు వెనకేసుకున్నాడు. 100 కొట్టాడు. టీమిండియా అభిమానులు శభాష్ అన్నారు. 150 కొట్టాడు. భేష్ అని కీర్తించారు. 145 బంతుల్లో..

IND vs NZ: కివీస్‌ వన్డేలో గిల్ సింహ గర్జన.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..

ఆ కుర్రాడి వయసు 23 సంవత్సరాలు. ఒక్క మ్యాచ్‌తో రికార్డుల మీద రికార్డులు వెనకేసుకున్నాడు. 100 కొట్టాడు. టీమిండియా అభిమానులు శభాష్ అన్నారు. 150 కొట్టాడు. భేష్ అని కీర్తించారు. 145 బంతుల్లో 200 కొట్టాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208 పరుగులు చేశారు. ఔరా అని అంతా ఆశ్చర్యపోయారు. ఆ చిచ్చరపిడుగు మరెవరో కాదు న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో గర్జించిన గిల్ (Shubman Gill). ఈ టీమిండియా ఓపెనర్ 150 పరుగులు పూర్తి చేసుకున్న తీరు, 200 పరుగులు సాధించిన సమయంలో వినిపించిన అభిమాన హోరు హైదరాబాద్ మ్యాచ్‌కే (Hyderabad ODI) హైలైట్‌గా నిలిచాయి.

FmwOV1iWAAM9dd8.jfif

147 పరుగుల వద్ద సిక్స్ కొట్టి 150 పరుగులు పూర్తి చేసుకున్నాడంటే గిల్ దంచుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 48వ ఓవర్‌లో 188 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వరుసగా హ్యాట్రిక్ సిక్సులు కొట్టి 200 పరుగుల మైలురాయిని కెరీర్‌లో తొలిసారి చేరుకున్న గిల్ గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. గిల్ 208 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షిప్లే బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి ఫిలిప్స్‌‌కు క్యాచ్‌గా చిక్కి ఔట్ కావడం గమనార్హం. కానీ.. హైదరాబాద్ వేదికగా గిల్(208) ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది.

FmwOUMBXoAY-0Rh.jfif

గిల్ గర్జనతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (34), విరాట్ కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5), సూర్యకుమార్ యాదవ్(31), హార్థిక్ పాండ్యా(28), వాషింగ్టన్ సుందర్ (12) పరుగులు చేసి ఔట్ కాగా.. గిల్ ఒక్కడే 208 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్ల పాలిట మాన్‌స్టర్‌గా నిలిచాడు. వన్డేల్లో 23 ఏళ్ల అతి తక్కువ వయసులో డబుల్ సెంచరీతో గర్జించిన తొలి టీమిండియా ఆటగాడిగా, డబుల్ సెంచరీ సాధించిన ఐదో టీమిండియా బ్యాట్స్‌మెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. న్యూజిలాండ్ జట్టుపైన అత్యధిక వ్యక్తిగత స్కోర్ (208) సాధించిన ఆటగాడిగా కూడా గిల్ నిలవడం విశేషం.

Updated Date - 2023-01-18T18:03:03+05:30 IST