Ben Stokes: అలా గెలవడం కంటే ఓడిపోవడమే మంచిది

ABN , First Publish Date - 2023-07-03T16:04:38+05:30 IST

లార్డ్స్ టెస్టులో ఆస్ట్రేలియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా బెయిర్ స్టోను ఔట్ చేసిందని పలువురు వాదిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఇంగ్లండ్ టెస్టు టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. విజయం కోసం వచ్చిన అవకాశాన్ని ఆస్ట్రేలియా వాడుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Ben Stokes: అలా గెలవడం కంటే ఓడిపోవడమే మంచిది

క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం బెయిర్ స్టో ఔట్‌పై పెద్ద చర్చ నడుస్తోంది. లార్డ్స్ టెస్టులో ఆస్ట్రేలియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా బెయిర్ స్టోను ఔట్ చేసిందని పలువురు వాదిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఇంగ్లండ్ టెస్టు టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. విజయం కోసం వచ్చిన అవకాశాన్ని ఆస్ట్రేలియా వాడుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఓవర్ పూర్తయిందని బెయిర్ స్టో క్రీజు దాటాడని.. కానీ ఆస్ట్రేలియా కీపర్ బాల్‌ను స్టంప్స్‌కు కొట్టడంతో ఔట్ అయ్యాడని స్టోక్స్ అన్నాడు. ఓవర్ ముగిసిందని మీరు అన్నారా అని తాను అంపైర్‌ను అడగ్గా.. అలా అనలేదని చెప్పినట్లు వివరించాడు. నిబంధనల ప్రకారం బెయిర్ స్టో ఔట్ అయినట్లు అంపైర్లు చెప్పారన్నాడు.

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాకు క్రీడా స్ఫూర్తి వర్తించదా?

అయితే ఈ పద్ధతిలో మీరు గెలవాలనుకుంటారా అని ఎవరైనా తనను అడిగితే తాను అలాంటి విజయం అక్కర్లేదని చెప్తానని బెన్ స్టోక్స్ అన్నాడు. తొండాట ఆడి గెలవడం కంటే ఓడిపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే దక్కే గెలుపు తమకు అవసరం లేదని స్టోక్స్ స్పష్టం చేశాడు. ఆ పరిస్థితిలో తాను ఉంటే ఆ అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటానని తెలిపాడు. సిరీస్‌లో వెనుకబడటంపై స్టోక్స్ స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితులను తాము గతంలో ఎన్నో సార్లు ఎదుర్కొన్నామని.. నేలకు కొట్టిన బంతిలా పుంజుకున్నామని గుర్తుచేశాడు.

కాగా బెయిర్ స్టో ఔట్ వివాదంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా స్పందించాడు. ఓడిపోయాక అందరూ సుద్దపూసల్లానే మాట్లాడతారని అన్నాడు. గతంలో 2019లో బెయిర్ స్టో ఇదే తరహాలో స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేయలేదా అని కమిన్స్ ప్రశ్నించాడు. లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో చాలా సార్లు క్రీజు దాటడాన్ని కీపర్ క్యారీ గమనించాడని.. చివరకు స్టంపౌట్ చేశాడని కమిన్స్ వివరించాడ

Updated Date - 2023-07-03T16:13:24+05:30 IST