Rishab Pant: పంత్ విషయంలో బీసీసీఐ ఊహించని నిర్ణయం!.. లక్కీ ఛాన్స్ !

ABN , First Publish Date - 2023-01-09T19:26:50+05:30 IST

ఘోర రోడ్డు ప్రమాదానికి గురయి కష్టకాలంలో ఉన్న టీమిండియా క్రికెటర్‌ రిషబ్ పంత్‌కు అండగా నిలుస్తూ (Rishab Pant) భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.

Rishab Pant: పంత్ విషయంలో బీసీసీఐ ఊహించని నిర్ణయం!.. లక్కీ ఛాన్స్ !

ముంబై: ఘోర రోడ్డు ప్రమాదానికి గురయి కష్టకాలంలో ఉన్న టీమిండియా క్రికెటర్‌ రిషబ్ పంత్‌కు అండగా నిలుస్తూ (Rishab Pant) భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మెడికల్ వ్యయాలు భరిస్తుండగా.. కమర్షియల్ విషయాల్లోనూ పంత్‌కు సంపూర్ణ ప్రయోజనం చేకూర్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఐపీఎల్ (IPL) సీజన్‌‌లో పంత్ ఆడకపోయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) నుంచి దక్కాల్సిన రూ.16 కోట్ల వేతనాన్ని చెల్లించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో భాగంగా దక్కే రూ.5 కోట్ల పూర్తి మొత్తాన్ని కూడా అందించాలని డిసైడ్ అయ్యింది. కాగా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల్లో పంత్ దాదాపు 6 నెలలపాటు క్రికెట్ ఆడే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ఏడాది మొత్తం మీద రూ.21 కోట్లు చెల్లిస్తున్నట్టవుతోంది. కాగా సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు అందరూ ఇన్సూర్డ్ (insured) ఆటగాళ్లే. నిబంధనల ప్రకారం.. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు ఏదైనా గాయం కారణంగా ఐపీఎల్‌‌లో ఆడలేకపోతే ఆ మొత్తాన్ని బీసీసీఐ చెల్లిస్తుంది. అయితే ఫ్రాంచైజీ కాకుండా బిల్లు మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది.

పంత్ ప్రస్తుత పరిస్థితి ఇదీ..

రోడ్డు ప్రమాదానికి గురైన ఇండియన్ వికెట్‌కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) రిషబ్ పంత్‌ ప్రస్తుతం ముంబైలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం సాయంత్రమే అతడి మోకాలికి సర్జరీ జరిగింది. ఈ ప్రభావంతో ఐపీఎల్ 2023 మాత్రమే కాకుండా ఆసియా కప్ 2023(సెప్టెంబర్), ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో (అక్టోబర్-నవంబర్) ఆడడం కూడా సందేహమే.

Updated Date - 2023-01-09T19:30:54+05:30 IST