Share News

IND vs AUS 2nd T20I: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్‌కి సిద్ధమైన భారత్

ABN , First Publish Date - 2023-11-26T18:55:32+05:30 IST

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు (ఆదివారం) ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలవగా..

IND vs AUS 2nd T20I: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్‌కి సిద్ధమైన భారత్

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు (ఆదివారం) ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలవగా ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత్ రంగంలోకి దిగనుంది. ఈ సిరీస్‌లో ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలుపొంది 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందాలని కసిగా ఉంది. అటు.. తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్‌తో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

ఇదిలావుండగా.. శనివారం మొత్తం తిరువనంతపురంలో భారీ వర్షం పడింది. దీంతో.. పిచ్‌ పాడవ్వకుండా ఉండేందుకు కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ పడే సమయంలోనూ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు కానీ, ప్రస్తుతం పరిస్థితులైతే బాగానే ఉన్నాయి. వర్షం పడే సూచనలు కనిపించడం లేదు. కాబట్టి.. ఈ మ్యాచ్ సజావుగానే సాగొచ్చు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. వర్షం పడొచ్చు. ఏదేమైనా.. వర్షం కారణంగా మైదానం తడిసి ముద్దైన తరుణంలో ‘పిచ్’ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే.. ఇక్కడ భారీ స్కోర్లు వచ్చే అవకాశాలు లేకపోయినా, ఇదొక మంచి స్పోర్టింగ్ వికెట్. ఇక్కడ బాల్ టర్న్ అవుతుంది కాబట్టి, కొత్త బంతికి మద్దతు లభిస్తుంది. అంటే.. మొదటి బ్యాటింగ్ భారత్‌కి కాబట్టి, కాస్త ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. అటు.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే ఆస్ట్రేలియా కూడా ఆరంభంలో స్వింగ్‌ను ఎదుర్కొవలసి ఉంటుంది. ఈ పిచ్‌లో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక స్కోరు 170 పరుగులు. మరి, భారత్ ఎంత స్కోరు కొడుతుందో చూడాలి.


తుది జట్లు ఇవే:

భారత్‌: రుతురాజ్‌, యశస్వీ, ఇషాన్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, అక్షర్‌, రవి బిష్ణోయ్‌, ప్రసిద్ధ్‌, ముకేశ్‌, అర్ష్‌దీప్

ఆస్ట్రేలియా: షార్ట్‌, స్మిత్‌, ఇన్‌గ్లిస్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్‌, డేవిడ్‌, మాథ్యూ వేడ్‌ (కెప్టెన్‌), అబాట్‌, ఎల్లిస్‌, జంపా, తన్వీర్‌ సంఘా

Updated Date - 2023-11-26T18:55:34+05:30 IST