Viral Video: మైదానంలో కోహ్లీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో చూపించిన అనుష్క.. విరుష్క జోడీ సూపర్ ఫన్!

ABN , First Publish Date - 2023-05-29T08:59:49+05:30 IST

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా, సరదాగా కనిపిస్తుంటారు. వీరి వైవాహిక బంధం చాలా సంతోషంగా సాగుతోంది. ఐపీఎల్‌లో లీగ్ దశలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వెనుదిరగడంతో కోహ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లండ్ బయల్దేరాడు.

Viral Video: మైదానంలో కోహ్లీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో చూపించిన అనుష్క.. విరుష్క జోడీ సూపర్ ఫన్!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ (Anushka Sharma) ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా, సరదాగా కనిపిస్తుంటారు. వీరి వైవాహిక బంధం చాలా సంతోషంగా సాగుతోంది. ఐపీఎల్‌లో (IPL 2023) లీగ్ దశలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వెనుదిరగడంతో కోహ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం (WTC Final Match) ఇంగ్లండ్ వెళ్లాడు. కోహ్లీతో పాటు అతడి భార్య అనుష్క కూడా ఇంగ్లండ్ (England) చేరుకుంది. అక్కడ వీరిద్దరూ ఓ ఈవెంట్‌లో అభిమానులకు సంతోషాన్ని పంచారు.


లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జూన్ 7వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు పూమా సంస్థ ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి హాజరయ్యాడు. ఆ ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి నవ్వులు పూయించారు. వ్యాఖ్యాత కోరిక మేరకు కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా, అనుష్క వెనకాల కీపింగ్ చేస్తూ స్లెడ్జింగ్ చేసింది. ఆ తర్వాత అనుష్క సినిమాలో డైలాగ్‌ను కోహ్లీ చెప్పాడు.


ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అవుట్ అయినప్పుడు మైదానంలో కోహ్లీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయని వ్యాఖ్యాత అడిగాడు. దానికి అనుష్క వేదిక అంతా తిరుగుతూ కోహ్లీ సెలబ్రేషన్స్‌ను అనుకరించింది (Anushka Sharma Hilariously Mimics Virat Kohli). ఈ జంట తమ సరదా పనులతో అందరికీ వినోదం పంచింది. అక్కడున్న అందరూ నవ్వుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-05-29T09:01:36+05:30 IST