Viral: స్విగ్గీ లేదా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా? జాగ్రత్త! ఈ వీడియో గనుక చూస్తే..

ABN , First Publish Date - 2023-08-06T17:12:19+05:30 IST

బెంగళూరులో ఓ ట్రాఫిక్ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడిన సమయంలో ఓ జొమాటో డెలివరీ బాయ్ కస్టమర్‌కు ఇవ్వాల్సిన ఆహారంలోంచి కొంత మొత్తాన్ని తిన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కోపంతో ఊగిపోయేలా చేస్తోంది.

Viral: స్విగ్గీ లేదా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా? జాగ్రత్త! ఈ వీడియో గనుక చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఈ జమానాలో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో! ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరిస్తే..శుచిగా తయారు చేస్తారని, డెలివరీ ఏజెంట్‌ కూడా ప్రొఫెషనల్‌గా ఉంటాడని, నిబంధనలు పాటిస్తూ టైంకు ఆహారాన్ని తెచ్చి ఇస్తాడనే నమ్మకంతో ఉంటాం. ఇలాంటి నమ్మకాన్ని వమ్ము చేసిన ఓ డెలివరీ ఏజెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడు చేసిన పని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(Viral video) మారింది.


పూర్తి వివరాల్లోకి వెళితే, ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ బెంగళూరులోని(Bengaluru) కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగాడు. ఆ సమయంలో అతడు కస్టమర్‌ కోసం తీసుకెళుతున్న పార్శిల్‌లో ఫుడ్‌ను కాలేక్షపం కోసమని తినేశాడు(zomato delivery boy eats customer food). అక్కడే ఉన్న ఓ కారులోని వ్యక్తి ఇదంతా కెమెరాతో రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది.

2.jpg


వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ వెలుగు చూశాయని, సదరు కంపెనీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా ఉండేందుకు నెటిజన్లు పలు సూచనలు కూడా చేశారు. ట్యాంపరింగ్‌కు వీలులేని విధంగా ఆహారాన్ని రెస్టారెంట్ వాళ్లు ప్యాక్ చేయాలని సూచించారు. ఇలా చేస్తే డెలివరీ ఏజెంట్లు చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-06T17:15:52+05:30 IST