Petrol Bunk: నో బాటిల్స్ అంటూ పెట్రోల్ బంక్‌లో నోటీస్.. అతి తెలివితో ఈ పిల్లాడు చేసిన పనేంటో చూస్తే..!
ABN , First Publish Date - 2023-07-21T19:00:34+05:30 IST
బైక్ నుంచి పెట్రోల్ ట్యాంకు ఊడదీసుకుని వచ్చిన ఓ కుర్రాడు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొనుక్కున్నాడు. ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్రోల్ వాళ్లు తెగేసి చెప్పడంతో మనోడు ఇలాంటి వింత ఐడియాను అమలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: అదేంటో కానీ కొందరికి వచ్చే వింత ఐడియాలు చూస్తే ఆటోమేటిగ్‌గా ముక్కున వేలేసుకుంటాం. నెట్టింట ప్రస్తుతం అలాంటి ఓ కుర్రాడి వీడియో వైరల్‌గా మారింది. అతడి తెలివితేటలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదేం తెలివిరాబాబూ.. ఎలా వస్తాయ్..ఇలాంటి ఐడియాలు అంటూ పంచ్‌లు విసురుతున్నారు.
టూవీలర్ ఉన్న వారు బాటిల్‌లో పెట్రోల్ తెచ్చుకునేందుకు అప్పుడప్పుడూ ట్రై చేస్తుంటారు. పెట్రోల్ అయిపోయిన విషయం గుర్తించకపోతే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కానీ అనేక పెట్రోల్ పంప్‌లు ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్రోల్, లేదా డీజిల్ ఇచ్చేందుకు అనుమతించవు. వీడియోలోని కుర్రాడికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో, మనోడు తన బుర్రకు పదునుపెట్టి ఓ వింత ఐడియాను(strange idea)అమలు చేశాడు.(youth gets his detached bike tank with filled with petrol)
ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్రోల్ ఇవ్వరు కాబట్టి, ఏకంగా బండికున్న పెట్రోల్ ట్యాంకును తీసుకెళ్లాడా మహానుభావుడు. అందులో పెట్రోల్ నింపుకుని ఇంటికొచ్చాడు. ఇదంతా చూసిన నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. అత్యవసరంలో ఉన్న వారికి ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్రోల్ ఇస్తే ఏంపోయిందని కొందరు అంటే మరికొందరు మాత్రం ప్రభుత్వం ఇలాంటి పనులను నిషేధించిందని చెప్పుకొచ్చారు. ఇలా చర్చోపచర్చల నడుమ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది(Viral Video).