Viral: నిద్రపట్టక అర్ధరాత్రి బాల్కనీలోకి వచ్చిన మహిళకు కనిపించిందో దెయ్యం.. భయంతో పారిపోయి తెల్లారే వచ్చి చూస్తే..!

ABN , First Publish Date - 2023-08-22T21:33:54+05:30 IST

అర్ధారాత్రి వేళ బాల్కనీలోకి వచ్చి ఎదిరింటి వైపు చూసిన మహిళ దెయ్యం లాంటి ఆకారం చెట్టుకు వేళాడుతూ కనిపించడంతో భయపడిపోయి లోపలికి పారిపోయింది. మర్నాడు ఉదయం చూస్తే అక్కడ చెట్టుకు నైటీ వేళాడుతూ కనిపించడంతో ఆమె ఆశ్చర్యపోయింది.

Viral: నిద్రపట్టక అర్ధరాత్రి బాల్కనీలోకి వచ్చిన మహిళకు కనిపించిందో దెయ్యం.. భయంతో పారిపోయి తెల్లారే వచ్చి చూస్తే..!

ఇంటర్నెట్ డెస్క్: నిద్రలేమితో(Insomnia) బాధపడుతున్న ఓ మహిళకు ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. ఓ రాత్రి వేళ ఆమె నిద్రపట్టక బాల్కనీలోకి వచ్చింది. అక్కడ నిలబడి ఉండగా ఆమెకు తన ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మకు ఓ వింత ఆకారం వేళాడుతూ కనిపించింది. అది ఓ మహిళ ఆత్మ అని భ్రమించిన ఆమె భయంతో లోపలికి పారిపోయింది. ఆ మరునాడు బెరుకుగా బయటకు వచ్చి చూస్తే నోరెళ్లబెట్టాల్సి వచ్చింది(woman mistakes nighty for ghost). సోషల్ మీడియాలో ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది(Viral Video).


సోషల్ మీడియాలోని కథనం ప్రకారం, అర్ధరాత్రి బాల్కనీలో నిలబడ్డ మహిళకు తన ఫ్లాట్ ఎదురుకుండా ఉన్న చెట్టు కొమ్మలకు మహిళను పోలిన ఓ ఆకారం వేలాడుతూ కనిపించింది. మహిళలు వేసుకునే నైటీ రూపంలో ఉందా ఆకారం. అసలే చీకటి, ఆపై నిద్రలేక అవస్థపడుతున్న ఆమెకు ఆ దృశ్యం చూడగానే దిమ్మతిరిగినంత పనైంది. గాలికి అటూఇటూ ఊగుతున్న ఆకారాన్ని చూసి ఆమె దెయ్యంగా భావించి ఒక్క పరుగున లోపలకు వచ్చేసి తలుపు బిడాయించి పడుకుంది.


రాత్రి ఎలాగో నిద్రలోకి జారుకున్న ఆమె తెల్లారి భయంభయంగా మళ్లీ బాల్కనీ వద్దకు వచ్చి చెట్లవైపు చూసింది. అక్కడ నైటీ ఆరేసి ఉండటం చూసి నివ్వెరపోయింది. రాత్రంతా తనను అంతలా భయపెట్టింది ఇదా అని షాకయిపోయానంటూ మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇలా ఎవరైనా దుస్తులు ఆరేస్తారా? నిన్న రాత్రి భయంతో పదిమార్లు హనుమాన్ చాలీసా చదువుకున్నానంటూ ఆమె వీడియోలో చెప్పడం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.

Updated Date - 2023-08-22T21:37:46+05:30 IST