Viral Video: 5 రూపాయల కోసం క్యాబ్ డ్రైవర్, ప్రయాణికురాలి గొడవ.. సరదా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
ABN , First Publish Date - 2023-12-11T15:06:12+05:30 IST
ఓ మహిళ, క్యాబ్ డ్రైవర్ 5 రూపాయల కోసం గొడవ పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social Media) వైరల్ గా మారింది.
ఢిల్లీ: ఓ మహిళ, క్యాబ్ డ్రైవర్ 5 రూపాయల కోసం గొడవ పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social Media) వైరల్ గా మారింది. సదరు ఘటన ఎక్కడ జరిగిందో సరిగ్గా తెలియనప్పటికీ.. వీడియోలోని వివరాల ప్రకారం.. ఓ మహిళ ఆఫీస్ కి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది. అందులో తాను వెళ్లవలసిన గమ్యాన్ని నిర్దేశించింది.
క్యాబ్ డ్రైవర్ నిర్మానుష్య ప్రదేశంలో ఆపాలని చూడగా.. మహిళ అతన్ని వారించింది. తనను లోకేషన్ లో దింపాలని కోరింది. దీనికి నిరాకరించిన క్యాబ్ డ్రైవర్ అక్కడే దిగాలని.. లోకేషన్ వరకు తీసుకెళ్లాలంటే మరో 5 రూపాయలు ఎక్కువ అవుతాయని చెబుతాడు. క్యాబ్ ఎక్కినప్పుడు తాను 95 రూపాయల ఛార్జ్ కే మాట్లాడానని.. ఇంకో 5 రూపాయలు ఎలా ఎక్కువ అడుగుతావని ఆమె ప్రశ్నించింది.
ఇది కాస్తా పరస్పర విమర్శలకు దారి తీసింది. చివరకు ఎలాగోలా గమ్యస్థానానికి చేర్చాడు. ఇన్ డ్రైవర్ అనే కంపెనీకి చెందిన క్యాబ్ లో మహిళ ప్రయాణించింది. ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది కాస్తా ఇన్ స్టాగ్రామ్ లో 2.3 మిలియన్ వ్యూస్ ని పొందగా.. సదరు కంపెనీ, క్యాబ్ డ్రైవర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు రూ.5 కోసం గొడవపడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్కడ డబ్బు ప్రధానం కాదని.. డ్రైవర్ ప్రవర్తన బాలేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఇన్ డ్రైవర్ కంపెనీ యాజమాన్యం క్షమాపణలు కోరింది.