14 నెలల పాటు మూత్ర విసర్జన చేయలేకపోయిన మహిళ! ఏం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-25T19:15:26+05:30 IST

బ్రిటన్‌కు చెందిన ఎల్లీ ఆడమ్స్ 14 నెలల పాటు మూత్ర విసర్జన చేయలేక నానా అవస్థలూ పడింది. అవును..బాత్రూంకు వెళ్లాలని పిస్తున్నా మూత్రం మిసర్జన మాత్రం కుదరక తీవ్ర ఇక్కట్ల పాలైంది.

14 నెలల పాటు మూత్ర విసర్జన చేయలేకపోయిన మహిళ! ఏం జరిగిందో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌కు(UK) చెందిన ఎల్లీ ఆడమ్స్ 14 నెలల పాటు మూత్ర విసర్జన చేయలేక నానా అవస్థలూ పడింది. అవును..బాత్రూంకు వెళ్లాలని పిస్తున్నా మూత్రం మిసర్జన మాత్రం కుదరక తీవ్ర ఇక్కట్ల పాలైంది. ఇటీవల సమస్య నుంచి కొంత మేర బయటపడిన ఆమె తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

అప్పటిదాకా ఎటువంటి అనారోగ్య సమస్యలూ ఎరుగని ఎల్లీ 2020 అక్టోబర్‌లో ఓ రోజు అనూహ్య పరిస్థితి ఎదుర్కొంది. అకస్మాత్తుగా మూత్రవిసర్జన ఆగిపోవడంతో ఆమెకు ఏంచేయాలో పాలూ పోలేదు. మూత్రాశయంలో క్రమంగా మూత్రం పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బంది పడింది. చివరకు ఆసుపత్రిలో వైద్యులు ట్యూబ్ ద్వారా మూత్రాన్ని తొలగించడంతో ఆమెకు ఉపశమనం లభించింది. నాటి నుంచి ఆమె ట్యూబ్(క్యాథెటర్) లేకపోతే మూత్ర విసర్జన చేయలేనిస్థితిలో కూరుకుపోయింది. దీంతో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది.

ఎల్లీకి అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించాక ఆమె ఫౌలర్స్ సిండ్రోమ్(Fowlers syndrome) అనే వ్యాధి బారినపడ్డట్టు వైద్యులు తేల్చారు. ఈ వ్యాధి బారిన పడ్డవారు సహజసిద్ధంగా మూత్ర విసర్జన చేయలేదు. ఈ వ్యాధి ఎందుకొస్తుందో ఇప్పటికీ తెలీదు. ప్రస్తుతం ఉన్న చికిత్సలు కూడా పరిమితమే. అంతేకాకుండా..వాటి వల్ల ఆశించిన ప్రయోజనం పూర్తి స్థాయిలో లభించదు. ఎల్లీకి కూడా ఈ సమస్య తప్పలేదు. ఆమె ఎన్ని మందులు వాడినా ఆశించిన ఉపశమనం మాత్రం దక్కలేదు. దీంతో.. వైద్యులు చివరి ప్రయత్నంగా ఆమె వెన్నుపూస చివరి భాగంలో ఓ పరికరాన్ని అమర్చారు. దీని సాయంతో మూత్రాశయాన్ని నియంత్రించే నాడులను విద్యుత్ సాయంతో ప్రేరేపించారు.

ఇక మూత్రానికి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా ఆమె ఈ పరికరంపై నే ఆధారపడుతున్నారు. అంతేకాకుండా.. అప్పుడప్పడూ క్యాథెటర్ కూడా వినియోగిస్తున్నారు. అయితే..ఎల్లీ జీవితాంతం ఈ పరికరంపై వాడకతప్పదని వైద్యులు తేల్చి చెప్పారు. కానీ..వెన్నుపూస కింద అమర్చిన పరికరంతో క్యాథెటర్ అవసరం ఏకంగా 50 శాతం మేర తగ్గిపోయిందని ఎల్లీ చెప్పారు. సమస్య నుంచి ఈ మాత్రమైనా ఉపశమనం దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-03-25T19:18:17+05:30 IST