నిర్మాణంలోని భవనాలకు ఆకుపచ్చని వస్త్రం ఎందుకు కప్పుతారో తెలుసా? దీనివెనుకనున్న కారణం ఇదే...

ABN , First Publish Date - 2023-05-07T13:18:45+05:30 IST

నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఆకుపచ్చ వస్త్రం(green cloth)తో కప్పివుంచడాన్ని మనం చూసే ఉంటాం. ఇలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిర్మాణంలోని భవనాలకు ఆకుపచ్చని వస్త్రం ఎందుకు కప్పుతారో తెలుసా? దీనివెనుకనున్న కారణం ఇదే...

నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఆకుపచ్చ వస్త్రం(green cloth)తో కప్పివుంచడాన్ని మనం చూసే ఉంటాం. ఇలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రక్రియ ప్రభుత్వ మార్గదర్శకాల(Government guidelines) కిందకు వస్తుంది. ఎత్తులో పనిచేసే కార్మికుల దృష్టిని మరల్చడమే దీని వెనుకనున్న కారణమని చెబుతున్నారు. అంత ఎత్తులో పనిచేసేవారు పరధ్యానం(distraction) చెందకూడదు.

అందుకే ఇలా వస్త్రాన్ని కప్పుతారు. భవన నిర్మాణంతో ఇలా చేయకపోతే అది కార్మికులకు ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంది. దీనితో పాటు, బయట లేదా చుట్టుపక్కల ప్రజలు(People around) ఎత్తయిన భవనాల వైపు చూసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ పనిచేసే వారు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలున్నాయి. దీని నివారణ(Prevention) కోసమే నిర్మాణంలోని భవనాలకు పచ్చని గుడ్డ కప్పుతారు. మరోవిధంగా చూస్తే భవన నిర్మాణ సమయంలో పెద్ద మొత్తంలో దుమ్ము, సిమెంట్(Cement) ఆ నిర్మాణ స్థలంలో ఎగిసిపడతాయి.

దీంతో అది చుట్టుపక్కల నివాసితులకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. చుట్టుపక్కల వారి ఇళ్లలోకి ధూళి చేరుతుంది. ఇలా జరగకుండా ఉండేందుకే నిర్మాణంలో ఉన్న భవనాలకు పచ్చని గుడ్డ(Green cloth) కప్పుతారు. కాగా ఇందుకోసం ఆకుపచ్చ రంగు మాత్రమే ఎందుకు వినియోగిస్తారనే విషయానికొస్తే.. ఈ రంగు చాలా దూరం నుండి కూడా కనిపిస్తుందని పరిశోధనల్లో(research) వెల్లడయ్యింది. అలాగే ఆకుపచ్చ రంగు రాత్రిపూట కొద్దిపాటి వెలుతురులోనూ కూడా పరావర్తనం చెంది, స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే నిర్మాణంలో ఉన్న భవనాలకు ఆకుపచ్చని గుడ్డ కప్పుతారు.

Updated Date - 2023-05-07T13:19:03+05:30 IST