Weekend Marriage: వారంలో రెండ్రోజులే సంసారం.. వేగంగా పాకుతున్న కొత్త ట్రెండ్.. దీని కథేంటంటే..

ABN , First Publish Date - 2023-03-13T17:02:05+05:30 IST

ప్రస్తుత ఆధునిక యుగంలో పెళ్లి పట్ల యువతకు ఓ రకమైన అభిప్రాయం ఏర్పడి పోయింది. పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ పోతుందని, బాధ్యతలు పెరిగి సంతోషం దూరమవుతుందనే భావన మొదలైంది.

Weekend Marriage: వారంలో రెండ్రోజులే సంసారం.. వేగంగా పాకుతున్న కొత్త ట్రెండ్.. దీని కథేంటంటే..

ప్రస్తుత ఆధునిక యుగంలో పెళ్లి (Marriage) పట్ల యువతకు ఓ రకమైన అభిప్రాయం ఏర్పడి పోయింది. పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ పోతుందని, బాధ్యతలు పెరిగి సంతోషం దూరమవుతుందనే భావన మొదలైంది. దీంతో చాలా మంది పాశ్చాత్య తరహాలో సహజీవనం (Live-in Realtion) చేయడానికి మొగ్గు చూపుతున్నారు. పెళ్లి చేసుకున్నా, ఇబ్బందులు పడకుండా ఉండేలా వీకెండ్ మ్యారేజెస్ (Weekend Marriages) వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ అమెరికా, జపాన్‌లలో (Japan) బాగా నడుస్తోంది.

అసలేంటీ ఈ వీకెండ్ మ్యారేజ్ అంటే.. వీరూ అందరిలాగానే పెళ్లి చేసుకుంటారు. అయితే ఇద్దరూ వారంతంలో మాత్రమే కలిసి ఉంటారు. మిగతా రోజుల్లో ఎవరి జీవితం వారు స్వేచ్ఛగా గడుపుతారు. ఈ పద్ధతిలో ఎవరి ఉద్యోగం, ఎవరి ఖర్చులు వారివే. వారాంతంలో మాత్రం కలిసి ఖర్చులు పంచుకుని ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పుడితే ఖర్చులు సగం సగం పెట్టుకుంటారు. ఈ వీకెండ్ మ్యారేజెస్ వల్ల చాలా లాభాలున్నాయని యువత భావిస్తోంది. వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే కలిసి ఉంటారు కాబట్టి, విభేదాలు, గొడవలు ఉండవు (Life style News).

పాపం.. ఆ మహిళను అత్యాచారం చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు.. వివాహం తర్వాత అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు..

ఈ వీకెండ్ మ్యారేజ్ వల్ల అటు బ్యాచిలర్ లైఫ్, ఇటు మ్యారీడ్ లైఫ్ ఒకేసారి అనుభవిస్తున్నట్టు ఉంటుందట. పైగా వారంతంలో ఇద్దరూ పని ఒత్తిడి లేకుండా ఉంటారు కాబట్టి, సంతోషంగా, సరదాగా గడుపుతారని, దాని వల్ల వారి మధ్య బంధం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వారమంతా కలిసి ఉండే జంటల కంటే ఇలా వారానికి రెండు రోజులు మాత్రమే కలిసి ఉండేవారు వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే జపాన్ తరహాలో భారత్‌లో కూడా ఈ ట్రెండ్ సక్సెస్ అవతుందా? అంటే చెప్పలేం.

Shocking: ఇదెక్కడి మోసం రా బాబూ.. స్మార్ట్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చి ఏకంగా రూ.7 లక్షలు కొట్టేశాడు.. అసలేం జరిగిందంటే..

Updated Date - 2023-03-13T17:02:05+05:30 IST